Viral: ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయి.. జాగ్రత్త..!

By telugu news teamFirst Published Aug 11, 2022, 11:41 AM IST
Highlights

మనమే.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి ముందుకు వెళ్తున్నా.. వెనక్కి తీస్తున్నా.. రోడ్డు ఎలా ఉంటుందో చూసుకోవాలి. లేకపోతే.. ఇలానే ఉంటుంది.

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. రోడ్డు ప్రమాదాలు ఊహించని విధంగా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఈ వీడియోనే ఒక నిదర్శనం. ఓ వ్యక్తి.... రోడ్డు మీద తన బైక్ ని రివర్స్ చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో చూసుకోకపోవడం వల్ల పెద్ద గుంటలో పడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ మధ్యకాలంలో పడిన భారీ వర్షాలకు రోడ్లు దారుణంగా మారిపోయాయి.  ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉంటుందో కూడా మనం చెప్పలేం. మనమే.. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి ముందుకు వెళ్తున్నా.. వెనక్కి తీస్తున్నా.. రోడ్డు ఎలా ఉంటుందో చూసుకోవాలి. లేకపోతే.. ఇలానే ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రయాణికులను విపరీతంగా భయపెడుతోంది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను వై మెన్ లివ్ లెస్ అనే పేజీ ట్వీట్ చేసింది. మోటారు సైకిల్ నడుపుతున్న వ్యక్తిని సంక్షిప్త వీడియోలో చూడవచ్చు. ఓ దుకాణం ముందు నిలబడి తన వాహనాన్ని రివర్స్‌ చేస్తున్నాడు. అతని వెనుక  ఉన్న గుంతను అతను చూసుకోలేదు.  నేరుగా  వెళ్లి అతను  భారీ గుంటలో పడిపోయాడు.  "జర్నీ ఆఫ్ ది ఎర్త్" అని వ్యంగ్యంగా క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ని ఇప్పటి వరకు   1.3 మిలియన్లకు పైగా  వ్యూస్ వచ్చాయి. ఇక కామెంట్ల వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. మీరు కూడా ఈ వీడియో పై  ఓ కన్నేయండి.

Journey to the Center of the Earth pic.twitter.com/CeFcYVxiSq

— Why men live less (@Menliveless)

 

click me!