కరోనా వైరస్ ను నిరోధించేందుకు ఆయుర్వేద ఔషధాలను కూడ తయారీపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ మేరకు ఈ ఔషధాలను కరోనా రోగులపై ప్రయోగించనున్నట్టుగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ వై నాయక్ ప్రకటించారు.
న్యూఢిల్లీ:కరోనా వైరస్ ను నిరోధించేందుకు ఆయుర్వేద ఔషధాలను కూడ తయారీపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ మేరకు ఈ ఔషధాలను కరోనా రోగులపై ప్రయోగించనున్నట్టుగా కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ వై నాయక్ ప్రకటించారు.
కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్ ను తయారిలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియాలో కూడ పలు సంస్థలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
undefined
also read:విద్యార్థులకు గుడ్‌న్యూస్: 10, 12 తరగతుల పరీక్షలు రద్దు, మార్కులిలా....
ఈ క్రమంలోనే కరోనా రోగులపై ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయుర్వేదం, యోగ, యునాని, సిద్ద, హోమియోపతి సంప్రదాయ పద్దతులు ఉన్నాయి.
కరోనా రోగులపై ఈ నాలుగు ఆయుర్వేద ఔషదాలను ప్రయోగించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ విషయమై సీఎస్ఐఆర్ తో కలిసి పనిచేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.వారం రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు మూడు మాసాల్లో వచ్చే అవకాశం ఉందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే, ఆయుర్వేద ,ఆయుష్ సెక్రటరీ విద్య రాజేష్ కోట్చాలు బుధవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.