‘‘నన్ను చంపేయ్.. బతికొచ్చి అద్భుతాలు సృష్టిస్తాను’’.. హత్యకేసులో షాకింగ్ విషయాలు..

Published : Dec 18, 2022, 10:30 AM IST
‘‘నన్ను చంపేయ్.. బతికొచ్చి అద్భుతాలు సృష్టిస్తాను’’.. హత్యకేసులో షాకింగ్ విషయాలు..

సారాంశం

ఓ హత్య కేసును చేధించిన పోలీసులు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. హత్యకు గురైన వ్యక్తి.. తాంత్రిక శక్తులతో అద్భుతాలను సృష్టిస్తానని నమ్మించి స్నేహితుడిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ పని చేయించాడని పోలీసులు గుర్తించారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ హత్య కేసును చేధించిన పోలీసులు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. హత్యకు గురైన వ్యక్తి.. తాంత్రిక శక్తులతో అద్భుతాలను సృష్టిస్తానని నమ్మించి స్నేహితుడిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ పని చేయించాడని పోలీసులు గుర్తించారు.  అనంతరం బాధితుడి స్నేహితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకన్నారు. వివరాలు.. డిసెంబరు 10న గాధియోన్ గ్రామ సమీపంలోని మిర్జాపూర్ హైవేకి సమీపంలోని నిర్జన ప్రదేశంలో ఆశిష్ దీక్షిత్ అనే వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.  ఇందుకు సంబంధించి క‌ర్చ‌నా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఆశిష్ సోదరుడి ఫిర్యాదు మేరకు కర్చానా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నైని ప్రాంతానికి చెందిన ఆశిష్ ఇటీవల స్థాపించిన రాజకీయ సంస్థ జనధర్ శక్తి పార్టీ ప్రమోషన్ కోసం వెళ్లేవాడని దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ఆధారంగా హరిద్వార్‌లోని నిరంజన్‌పూర్ గ్రామానికి చెందిన నితీష్ సైనీ అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు శుక్రవారం హరిద్వార్‌లో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆశిష్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 9న అతడిని హత్య చేశానని నితీష్ విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 

అయితే.. హరిద్వార్‌లో కొన్ని నెలల క్రితం ఆశిష్ దీక్షిత్‌తో నితీష్‌కు పరిచయం ఏర్పడింది. నితీష్ హరిద్వార్‌లో ఆశిష్‌తో కలిసి జీవించడం ప్రారంభించాడు. నితీష్  ఖర్చులన్నీ ఆశిష్ భరించాడు. డిసెంబర్ 8న ఆశిష్, నితీష్ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి హోటల్‌లో బస చేసి వింధాయాంచల్ ధామ్‌కు వెళ్లారు. వారు ప్రయాగ్‌రాజ్‌కు తిరిగి వచ్చిన తర్వాత.. ఆశిష్ అతడిని చంపాల్సిందిగా నితీష్‌ని కోరాడు. అలా చేయడం ద్వారా తనకు అతీంద్రియ శక్తులను పొందడంలో సహాయపడుతుందని నమ్మించాడు. ‘‘నన్ను చంపేయ్.. మ‌ళ్లీ బ‌తికి వస్తాను.. ఆధ్యాత్మిక‌, తాంత్రిక శ‌క్తుల‌తో అద్భుతాలు సృష్టిస్తాను’’ అని చెప్పాడు. నితీష్ ఇందుకు అంగీకరించకపోవడంతో.. అతడి కోసం ఖర్చు చేసిన నగదును తిరిగి ఇవ్వమని ఆశిష్ ఒత్తిడి చేసాడు. దీంతో నితీష్ ఈ నేరానికి పాల్పడ్డాడు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?