తమిళనాడు కాంచీపురం ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం: మంటార్పిన ఫైరింజన్లు

By narsimha lodeFirst Published Dec 18, 2022, 9:27 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఎలక్ట్రిక్  బైక్ షోరూమ్ లో  అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 50 ఎలక్ట్రిక్ బైక్ లు దగ్దమయ్యాయి. 

చెన్నై:తమిళనాడు కాంచీపురంలో  ఎలక్ట్రిక్  బైక్ షోరూమ్‌లో  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ  అగ్ని ప్రమాదంలో  50 బైక్ లు   దగ్గమయ్యాయి.  అగ్నిప్రమాదం తెలిసిన వెంటనే  స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం ఇచ్చారు.  ఫైరింజన్లు  ఈ బైక్   షోరూమ్ లో  మంటలను ఆర్పాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల  కారణాలపై  అధికారులు  ఆరా తీస్తున్నారు.ఈ బైక్స్ లోని బ్యాటరీలు  పేలి  మంటలు వ్యాపించాయా, లేదా ఇతర కారణాలున్నాయా అనే విషయమై  అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు  చేస్తున్నారు.  

గతంలో కూడ దేశంలోని పలు రాష్ట్రాల్లో  ఈ బైక్ షోరూమ్ లలో  అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్  11 వ తేదీన చెన్నైలోని ఈ బైక్ షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో  17 బైక్ లు దగ్దమయ్యాయి.చెన్నైలోని  ప్రధాన రహదారిలోని షోరూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో  షోరూమ్ లో ఐదుగురు ఉద్యోగులున్నారు.ఓ బైక్ కు చార్జింగ్ పెడుతున్న సమయంలో బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి.ఈ మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇతర   బైక్ లకు కూడా మంటలు వ్యాపించాయి.

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో  ఈ బైక్ షోరూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలోని మంటలు  ఇదే భవనంలో ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి.ఈ ప్రమాదంలో  ఎనిమిది మృతి చెందారు.ఈ ఘటన సెప్టెంబర్  13న జరిగింది. సికింద్రాబాద్ లోని  ఓ భవనం  సెల్లార్ లో  ఈ బైక్స్ షో రూమ్ ఉంది.ఈ షోరూమ్ లో మంటలు వ్యాపించాయి. ఇదే భవనం పై అంతస్తులో  లాఢ్జి ఉంది.  ఈ మంటల కారణంగా   లాడ్జిలోకి పొగ వ్యాపించింది. లాడ్జిలో ఉంటున్నవారిలో  ఎనిమిది మంది  మృతి చెందారు.

click me!