
గయా : బీహార్‌లోని గయలో శుక్రవారం ఓ మహిళ రైల్వే ట్రాక్‌ను దాటుతుంది. అంతలో స్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు అకస్మాత్తుగా కదలింది. దీంతో ఆ మహిళ గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. గయాలోని టంకుప్ప రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్లాట్‌ఫారమ్‌కు అవతలి వైపు నుంచి మరో రైలు ఎక్కాల్సి రావడంతో ఆ మహిళ ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో ఆగి ఉన్న రైలు మీదినుంచి దిగడానికి ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా రైలు కదలడంతో ఆ మహిళ పట్టు కోల్పోయి కింద పడిపోయింది. అయితే, ఆమె వెంటనే పట్టాల మధ్యలో అలాగే పడుకుని ఉండిపోయింది. దీంతో గాయాలతో బయటపడింది. ఆమె పడడం గమనించిన అక్కడివారు దీన్నంతా వీడియో తీశారు.
గుజరాత్‌లోని సూరత్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8గా తీవ్రత నమోదు
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, గాయపడకుండా ఉండటానికి ఆమె రైలు ట్రాక్‌పై పడుకుని ఉండడం.. రైలు ఆమె మీదుగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. రైలు వెళ్లిపోగానే.. ఆమె పడిపోవడం గమనించిన కొందరు పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను బయటకు తీశారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయమయ్యింది. దీంతో మహిళను స్థానిక ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు.