గుజరాత్‌లోని సూరత్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8గా తీవ్రత నమోదు

Published : Feb 11, 2023, 01:54 PM IST
గుజరాత్‌లోని సూరత్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8గా తీవ్రత నమోదు

సారాంశం

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) అధికారి తెలిపారు.

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం నమోదైందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్‌ఆర్) అధికారి తెలిపారు.సూరత్‌కు పశ్చిమ నైరుతి (డబ్ల్యూఎస్‌డబ్ల్యూ) దూరంలో 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెప్పారు. ‘‘భూకంపం 5.2 కిలోమీటర్ల లోతులో నమోదైంది. భూకంప కేంద్రం జిల్లాలోని హజీరా తీరాన అరేబియా సముద్రంలో ఉంది.ఈ ప్రకంపనల వల్ల ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదు" అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.

గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (GSDMA) ప్రకారం.. రాష్ట్రం అధిక భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956, 2001లలో గుజరాత్‌లో భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. 2001 కచ్ భూకంపం అత్యంత విధ్వంసక భూకంపం. ఆ సమయంలో 13,800 మందికి పైగా మరణించారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !