ప్రేక్షకులకు శుభవార్త: నచ్చిన ఛానెళ్ ఎంపికకు గడువు పొడిగింపు

By Siva KodatiFirst Published Feb 13, 2019, 7:28 AM IST
Highlights

కొత్త బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ విధానం, నూతన టారిఫ్ కింద ఛానెళ్ల ఇంకా ఎంచుకోలేదా..? ఏం జరుగుతుందోనని భయపడుతున్నారా..? డోంట్ వర్రీ అలాంటి వారందరికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరోసారి గడువు పొడిగించింది.

కొత్త బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ విధానం, నూతన టారిఫ్ కింద ఛానెళ్ల ఇంకా ఎంచుకోలేదా..? ఏం జరుగుతుందోనని భయపడుతున్నారా..? డోంట్ వర్రీ అలాంటి వారందరికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరోసారి గడువు పొడిగించింది.

మార్చి 31 లోపు వినియోగదారులు తమకు కావాల్సిన ఛానెళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. గతంలో ఆ గడువు జనవరి 31 వరకు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 100 మిలియన్ల కేబుల్ సర్వీసులు, 67 మిలియన్ల డీటీహెచ్‌ సర్వీసులు ఉన్నట్లు ట్రాయ్ నివేదికలో తేలింది.

వీటిలో ఏ ఛానెల్ ఎంచుకోవాలన్న దానిపై వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్ల, ఎమ్మెస్వోలు ఛానెళ్ల ఎంపిక విషయంలో వినియోగదారులకు సహకరించకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని ట్రాయ్ తెలిపింది.

కొత్త కేబుల్ విధానంలో వినియోగదారులు తమకు కావాల్సిన ఛానెళ్లను మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకుని చూడవచ్చు. పన్నులతో కలిపి రూ.130కే 100 ఛానళ్లను వినియోగదారులు పొందవచ్చు. తాము ఏయే ఛానళ్లను చూడాలనుకుంటున్నారో తమ సర్వీస్ ప్రొవైడర్‌కు చెప్పాల్సి ఉంటుంది.

దేశవ్యాప్తంగా 65 శాతం మంది కేబుల్ యూజర్లు, 35 శాతం మంది డీటీహెచ్ కస్టమర్లు తమకు కావాల్సిన ఛానల్స్‌ను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్ పేర్కొంది. కస్టమర్లు తమకు కావాల్సిన ఛానల్స్‌ను ఎంపిక చేసుకునే వరకు లేదా బెస్ట్ ఫిట్ ప్లాన్‌కు బదిలీ అయ్యే దాకా పాత పథకమే కొనసాగుతుందని ట్రాయ్ తెలిపింది.
 

click me!