కొంపముంచిన ట్రాఫిక్ ఛలానా.. సీసీకెమెరాలతో బయటపడ్డ 'ఎఫైర్'..

Published : May 11, 2023, 05:22 AM IST
కొంపముంచిన ట్రాఫిక్ ఛలానా.. సీసీకెమెరాలతో బయటపడ్డ 'ఎఫైర్'..

సారాంశం

కేరళ రోడ్లపై ఏర్పాటుచేసిన భద్రత కెమెరాలు విజయన్ ప్రభుత్వానికే కాదు.. ఓ వ్యక్తికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టాయి. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో అతని వివాహేతర సంబంధ రహస్యం బట్టబయలయింది.  

కేరళ రోడ్లపై ఏర్పాటుచేసిన భద్రత కెమెరాలు విజయన్ ప్రభుత్వానికే కాదు.. ఓ వ్యక్తికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టాయి. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో అతని వివాహేతర సంబంధ రహస్యం బట్టబయలయింది.  వివరాల్లోకి వెళ్తే.. ఇడుక్కికి చెందిన ఓ వ్యక్తి టెక్స్‌టైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతడు ఏప్రిల్ 25న తన స్నేహితురాలితో కలిసి హెల్మెట్ ధరించకుండా నగరంలోని వీధుల్లో బైక్ పై దూసుకెళ్లాడు.

అయితే.. సదరు వ్యక్తికి, అతని స్నేహితురాలికి హెల్మెట్ లేకపోవడంతో ఆ దృశ్యాలను అక్కడ ఏర్పాటు కెమెరాలు రికార్డ్ చేశాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో బైక్ యజమానికి ఛలానా పంపారు ట్రాఫిక్ అధికారులు.   ఇక్కడే అసలు ట్విట్ ఉంది. ఆ బైక్.. సదరు వ్యక్తి మీద కాకుండా తన భార్య పేరిట రిజిష్టర్ కావడం, ఆమెనే ఆ బైక్ ఓనర్ కావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు, చెల్లించాల్సిన జరిమానా తదితర వివరాలను మొబైల్ ఫోన్ కు మెసేజ్ గా వచ్చాయి. ఈ వివరణతో పాటు బైక్ ఫోటో కూడా.. ఆ ఫోటోలో తన భర్త వెనుకల ఓ మహిళ చాలా క్లోజ్ గా కూర్చోని ఉంది. 

చలాన్ సంబంధించిన మెసేజ్, ఫోటో భార్య ఫోన్ కు రావడంతో ఇంట్లో తుఫాను వచ్చింది. మెసేజ్ అందుకున్న భార్య.. ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరని తన భర్తను ప్రశ్నించింది. అయితే ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని 32 ఏళ్ల వ్యక్తి తన వివరణలో పేర్కొన్నాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆ మహిళ అప్పుడే తని లిఫ్ట్‌ అడిగి బైక్ ఎక్కిందని చెప్పుకొచ్చారు. కానీ, భర్త వివరణను,వాదనను భార్య నమ్మకపోవడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగి విషయం తీవ్రమైంది. ఆ క్రమంలో ఇరువురి మధ్య దాడి కూడా జరిగింది.

భార్య ఫిర్యాదుతో జైలుకు 

భర్త తనపై, తమ మూడేళ్ల చిన్నారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ భార్య మే 5న కరమ్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య వాంగ్మూలం మేరకు భర్తను అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని IPC సెక్షన్లు కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. విశేషమేమిటంటే.. కేరళ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ 'సేఫ్ కేరళ' కింద రాష్ట్రంలోని రోడ్లపై కెమెరాలను అమర్చారు. దానిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం తలెత్తింది. అవినీతిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్