ఫిఫా వరల్డ్ కప్ చూస్తుండగా విషాదం.. ఐదో అంతస్తు నుంచి పడి మూడేళ్ల బాలుడి మరణం..

By team teluguFirst Published Dec 20, 2022, 4:14 PM IST
Highlights

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను పెద్ద స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబంతో కలిసి వెళ్లిన మూడేళ్ల బాలుడు వాష్ రూమ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఐదో అంతస్తు నుంచి జారి కిందపడ్డాడు. 

ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు తన తల్లిదండ్రులతో వెళ్లిన మూడేళ్ల బాలుడు ఐదో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్ కు మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ ను పెద్ద స్క్రీన్ పై చూసేందుకు ఓ కుటుంబం దక్షిణ ముంబైలోని చర్చ్ గేట్ ప్రాంతంలోని గార్వేర్ క్లబ్ హౌస్ కు ఆదివారం సాయంత్రం వెళ్లింది.

షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంటు సమావేశాలు ముగింపు!

అయితే ఆ కుటంబానికి చెందిన మూడేళ్ల హృద్యాంశు రాథోడ్ అనే బాలుడు క్లబ్ లోని ఐదో అంతస్తులో ఉన్న వాష్ రూమ్ కు వెళ్లాడు. అతడి వెంట మరో 11 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో కుటుంబం మొత్తం ఆరో అంతస్తు మేడపై కూర్చొని మ్యాచ్ ను చూస్తోంది. అయితే ఈ పిల్లలు వాష్ రూమ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఫ్లోర్ రెయిలింగ్ లోని ఖాళీ నుండి హృదయన్షు రాథోడ్ జారిపడ్డాడు.

అవును.. అరవింద్ కేజ్రీవాల్ ను కలిశాను.. ఆప్ నేతలకు డబ్బులు చెల్లించాను - సుఖేశ్ చంద్రశేఖర్

మెట్లను కవర్ చేసే సెఫ్టీ గ్లాస్ లోని ఖాళీ ద్వారా బాలుడి పడిపోయాడని సమాచారం. అయితే ఆ బాలుడు జరిపడిన సమయంలో ఒక్క సారిగా అరిచాడు. దీంతో ముందు నడుస్తున్న 11 ఏళ్ల బాలుడికి ఒక్క సారిగా కొంత శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసేలోపే ఆ మెట్ల సందులో నుంచి ఆ బాలుడు పడిపోతూ కనిపించాడు.

యూపీ మదర్సాల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు తప్పనిసరి.. నేడు సమావేశం

దీంతో వెంటనే ఆ బాలుడు మేడపైకి పరిగెత్తి హృదయన్షు రాథోడ్ జారిపడి పడిపోయినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారంతా గ్రౌండ్ ఫ్లోర్ కు పరిగెత్తారు. అక్కడ బాలుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తీవ్రంగా విలపించారు. బాలుడి నుదిటిపై, తల వెనుక భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, క్లబ్ సెక్యూరిటీ గార్డులు కలిసి సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కానీ బాలుడు అప్పటికే చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. 

దారుణం.. 15 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఒకరు మైనర్.. ఎక్కడంటే ?

ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 11 ఏళ్ల బాలుడి, సెక్యూరిటీ గార్డు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!