విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?

By Asianet News  |  First Published Apr 18, 2023, 8:48 AM IST

ఓ రైస్ మిల్ మూడు అంతస్థలు భవనం కూలి ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 18 మందికి గాయాలు అయ్యాయి. మరి కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. 


హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. కర్నాల్ జిల్లా తారావాడి వద్ద రైస్ మిల్లులో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. శిథిలాల కింద 20 నుంచి 25 మంది కూలీలు చిక్కుకున్నారని తెలుస్తోంది. భవనం కూలిన సమాచారం అందడంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయ్యింది. వెంటనే అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వానర సాయం.. పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లి.. అల్లాడిపోతూ కాపాడిన కోతి.. వీడియో వైరల్

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. తారావాడిలో ఉన్న శివశక్తి అనే రైస్ మిల్లు మూడు అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది కూలీలు నివసించేవారు. సోమవారం రాత్రి చాలా మంది కార్మికులు అందులోనే నిద్రపోయారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ భవనం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. దీంతో 20 నుంచి 25 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కాగా ఇద్దరు కూలీలు మృతి చెందారని, 18 మంది కూలీలు గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. 

వార్నీ.. మహిళను కాటేసిన పాము.. విషసర్పాన్ని కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. యూపీలో వింత ఘటన

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న కూలీలను పోలీసులు, రెస్క్యూ టీం బయటకు తీసుకొస్తున్నారు. ప్రమాదాన్ని చూసిన ఇతర కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. షాక్ లో వారు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. 

| Haryana: Several rice mill workers feared being trapped under debris after a three-storeyed rice mill building collapsed in Karnal. Workers used to sleep inside the building. Fire brigade, police and ambulance have reached the spot. Rescue operations underway. pic.twitter.com/AFzN9HDPYw

— ANI (@ANI)

కాగా.. భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియడం లేదు. రైస్ మిల్లు లోపల మూడంతస్తుల భవనం కూలిపోవడంతో.. మిల్లు ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే డీసీ అనీష్ యాదవ్, ఎస్పీ శశాంక్ సావన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, రెస్క్యూ వర్కర్లు క్రేన్ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ విడుదల చేసింది. అందులో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తూ కనిపించారు.

click me!