టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ అదృశ్యం.. కొడుకు ఆందోళన

Published : Apr 18, 2023, 06:05 AM IST
టీఎంసీ సీనియర్ నేత ముకుల్ రాయ్ అదృశ్యం.. కొడుకు ఆందోళన

సారాంశం

టీఎంసీ సీనియర్ లీడర్ ముకుల్ రాయ్ మిస్సింగ్ అని కొడుకు సుబార్షు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విమానంలో ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆయన అందుబాటులో లేకుండా పోయాడని వివరించారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.  

కోల్‌కతా: టీఎంసీ సీనియర్ లీడర్ ముకుల్ రాయ్ అదృశ్యమైయ్యాడని కొడుకు సుభార్షు తెలిపారు. తండ్రి ముకుల్ రాయ్ సోమవారం సాయంత్రం ఇండిగో విమానంలో ఢిల్లీకి ప్రయాణం అయ్యాడని వివరించారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేకుండా పోయిందని చెప్పారు. ఆ ఫ్లైట్ రాత్రి 9.55 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయిందని, కానీ, తన తండ్రి మాత్రం అప్పటి నుంచి అన్‌ట్రేసెబుల్‌గానే ఉన్నాడని వివరించారు.

సోమవారం సాయంత్రం నుంచి తండ్రి ముకుల్ రాయ్‌ అందుబాటులో లేకుండా పోయాడని మాజీ రైల్వే శాఖ మంత్రి కొడుకు సుబార్షు తెలిపారు. ఇప్పటి వరకు తన తండ్రిని ట్రేస్ చేయలేకపోయానని సోమవారం రాత్రి పేర్కొన్నారు.

ముకుల్ రాయ్, ఆయన కొడుకు సుబార్షు మధ్య ఆదివారం తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఆ గొడవ తర్వాతనే తండ్రి ముకుల్ రాయ్ మిస్సింగ్ అయ్యాడని పేర్కొన్నాయి. భార్య చనిపోయిన తర్వాత ముకుల్ రాయ్ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఆయన హాస్పిటల్‌లో అడ్మిటయ్యి చికిత్స తీసుకున్నారు.

ఎయిర్ పోర్టు పోలీసు అధికారులకు తన కుటుంబం తండ్రి ముకుల్ రాయ్ మిస్సింగ్ పై ఫిర్యాదు అందించినట్టు కొడుకు సుబార్షు తెలిపారు. కానీ, తమకు ఫార్మల్‌గా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసు వర్గాల వివరించాయి.

Also Read: హైదరాబాద్‌ కోఠిలో సూట్ కేసు వదిలిపెట్టారు.. బాంబ్ అని భయపడ్డ స్థానికులు.. పోలీసులకు సమాచారం

తృణమూల్ కాంగ్రెస్‌లో ముకుల్ రాయ్ నెంబర్ 2 గా కొనసాగారు. కానీ, 2017లో ఆయన మమతా బెనర్జీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరారు. టీఎంసీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు వచ్చాక ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిని చేసింది. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్ పై గెలిచారు. కానీ, ఫలితాల ప్రకటన తర్వాత ఆయన తిరిగి టీఎంసీలో చేరారు.

మళ్లీ టీఎంసీలోకి వచ్చినప్పటి నుంచి ఈ 68 ఏళ్ల నేత లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్