తమిళనాడులో విషాదం.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి, మరొకరికి గాయాలు

By Asianet NewsFirst Published May 19, 2023, 6:47 AM IST
Highlights

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో ఉన్న ఊరంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన పై సీఎం విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా కర్మాగారంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులను ఎస్.కుమరేశన్, ఆర్.సుందరరాజ్, కె.అయ్యమ్మాళ్ గా గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ప్రమాదం శివకాశిలోని ఊరంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది.

ముస్లింలకు, షార్ట్ డ్రెస్ లు వేసుకునే వారికి నో ఎంట్రీ.. - యూపీలోని ప్రసిద్ద అలీగఢ్ హనుమాన్ ఆలయ కొత్త రూల్స్

ఈ పేలుడులో ఒకరు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయన ప్రస్తుతం జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుడిని ఎస్ ఇరులాయిగా గుర్తించారు. కాగా.. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు సాయం అందిస్తామని చెప్పారు.

‘చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు థ్యాంక్స్..’- న్యాయశాఖ మంత్రి గా తొలగింపు తర్వాత కిరణ్ రిజిజు తొలి ట్వీట్

మృతుల కుటుంబాలకు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముగ్గురు వ్యక్తుల మరణవార్త విని చాలా బాధపడ్డానని అన్నారు. గాయపడిన వ్యక్తికి ప్రత్యేక చికిత్స అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ నెల 6వ తేదీన ఇదే రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉన్న ఓ బాణసంచా ఫ్యాక్టరీలో కూడా పేలుడు సంభవించింది. శివనార్పురం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఒక మహిళ మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Mobile Phone Blast: జేబులో పేలిన మొబైల్ ఫోన్ .. వృద్ధుడికి తృటిలో ప్రమాదం పెను ప్రమాదం. .

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై కడలూరు జిల్లా కలెక్టర్ కె.బాలసుబ్రహ్మణ్యం వివరాలు తెలుపుతూ.. ఒక మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి మూడు లక్షల రూపాయల సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. అలాగే గాయపడిన మహిళలకు ఒక్కొక్కరికి ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ.50 వేల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. 
 

click me!