కాన్పూర్ లో ఘోరం.. పొల్యూషన్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ముగ్గురు కూలీలు మృతి

By team teluguFirst Published Nov 11, 2022, 2:20 PM IST
Highlights

పొల్యూషన్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా విషవాయులు పీల్చి ఓ ముగ్గురు కార్మికులు చనిపోయారు. ఈ ఘటన యూపీలో కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో ఘోరం జరిగింది. జాజ్‌మౌలోని ఓ చర్మశుద్ధి కర్మాగారంలో ఉన్న పొల్యూషన్ ట్యాంక్ ను క్లీన్ చేస్తున్న సమయంలో ముగ్గురు కూలీలు చనిపోయారు. క్లీనింగ్ సమయంలో వారు విషవాయువులు పీల్చడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు.

కడుపు నొప్పి అని వెడితే కిడ్నీ గాయబ్...ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ ఘాతుకం...

మృతులను సుఖ్‌బీర్ సింగ్ (35), సోను బాల్మీకి (28), సత్యం యాదవ్ (26)గా గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) రవీంద్ర కుమార్ పేర్కొన్నారని ‘పీటీఐ’నివేదించారు. కూలీలు ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి స్పృహతప్పి పడిపోయారని ఆయన తెలిపారు. అయితే వారిని ఫ్యాక్టరీ సిబ్బంది కార్మికులను లాలా లజపతిరాయ్ హాస్పిటల్ కు తరలించారని చెప్పారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ఆరుగురు దోషులను విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశం..

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేకెత్తించింది. 

click me!