కడుపు నొప్పి అని వెడితే కిడ్నీ గాయబ్...ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ ఘాతుకం...

By SumaBala BukkaFirst Published Nov 11, 2022, 1:56 PM IST
Highlights

కడుపునొప్పి అని వెడితే.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి.. కిడ్నీనే మాయం చేశాడో డాక్టర్. ఇది తెలియని పేషంట్ హాయిగా ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ కడుపునొప్పి రావడంతో... 

ఉత్తరప్రదేశ్ : గోటి సమస్యకు మందు వేస్తే.. చేయి పోయినట్లు తయారయ్యింది ఈ వ్యక్తి పరిస్థితి. ఒంట్లో నలతగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాడు. టెస్టులు చేసి కిడ్నీలో రాళ్లు పడ్డాయని డాక్టర్ చెప్పాడు. ఆ తరువాత ఆపరేషన్ చేసి.. వాటిని రిమూవ్ చేశాడు. కొంతకాలం తరువాత మళ్లీ విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కంగుతినే విషయం చెప్పారు. అతడి కడుపులో ఒక కిడ్నీ మాత్రమే ఉందని కచ్చితంగా చెప్పేశారు.

మొదట ఆపరేషన్ చేసిన వైద్యుడు ఏకంగా కిడ్నీనే లేపేశాడు అని అర్థమయ్యింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే... కాస్ గంజ్ జిల్లాకు చెందినే సురేష్ చంద్ర పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతమైన బ్యాక్ పెయిన్ రావడంతో.. హాస్పిటల్ కు వెళ్లాడు. పలు రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. రిపోర్టులు పరిశీలించారు. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేల్చారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. 

రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశం..

దీంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆమోదంతో 2 రోజుల తరువాత ఏప్రిల్ 14న అలిగఢ్ హాస్పిటల్ లో అతడికి కిడ్నీ ఆపరేషన్ చేశారు. ఆ తరువాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో అతను ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. కాస్త బాగయ్యాక తిరిగి డ్యూటీకి వెళ్లడం ప్రారంభించాడు. అయితే, అక్టోబర్ 29న అతడికి హఠాత్తుగా మల్లీ కడుపునొప్పి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కిడ్నీలు రాళ్లు తీసేసినా మళ్లీ కడుపునొప్పి రావడం ఏమిటని భయపడ్డాడు. 

వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతడిని పరీక్షించి అల్ట్రా సౌండ్ స్కాన్ రాశారు. దాని రిపోర్టులు చూసి డాక్టర్లు ఖంగుతిన్నారు. ఆ విషయం విని సురేష్ షాక్ అయ్యాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు శస్త్ర చికిత్స చేసేప్పుడు.. రాళ్లతో పాటు కిడ్నీ కూడా తీసేశారు డాక్టర్లు. ఈ విషయం అతడికి గానీ, కుటుంబసభ్యులకు గానీ తెలియదు. ఇప్పుడు కడుపునొప్పి రావడంతో.. వేరే ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని సురేష్ చంద్ర ఈ ఘటన మీద ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. 

click me!