హర్యానాలో విషాదం.. రిషికేశ్‌లోని గంగానదిలో రాఫ్టింగ్ చేస్తూ టూరిస్ట్ మృతి..

Published : Mar 13, 2023, 11:31 AM IST
హర్యానాలో విషాదం.. రిషికేశ్‌లోని గంగానదిలో రాఫ్టింగ్ చేస్తూ టూరిస్ట్ మృతి..

సారాంశం

గంగానదిలో రాఫ్టింగ్ చేస్తుండగా బోటు బోల్తా పడటంతో ఓ యువతి చనిపోయింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని రిషికేశ్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలు ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ మార్కెటింగ్ విభాగంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు.


హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. రిషికేశ్‌లోని గోల్ఫ్ కోర్స్ ర్యాపిడ్ ప్రాంతంలో గంగానదిలో రాఫ్టింగ్ చేస్తూ ఓ టూరిస్ట్ మరణించింది. ఆమె ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలిని అంబాలా ప్రాంతానికి చెందిన నివాసి రూప కుమారిగా పోలీసులు గుర్తించారు.

వలస కార్మికులపై దాడికి సంబంధించిన ఫేక్ వీడియో షేర్ చేసిన బీహార్ వ్యక్తి అరెస్ట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాలాకు చెందిన 28 ఏళ్ల రూప కుమారి, తన సోదరుడు ఆదిత్య, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రిషికేశ్‌లోని గంగానదిలో ఫూల్‌చట్టి వద్దకు రాఫ్టింగ్‌కు వెళ్లారు. అక్కడ వారు కలిసి ఒక బోట్ ను అద్దెకు తీసుకున్నారు. రాఫ్టింగ్ మొదలు పెట్టి గోల్ఫ్ కోర్స్ ర్యాపిడ్ ఏరియా దగ్గర అకస్మాత్తుగా బోటు బోల్తా పడింది. 

అనుకోని ఈ ప్రమాదం వల్ల రూప నీటిలో పడిపోయింది. బోట్ గైడ్, అతడి సహాయకులు వెంటనే ఆమెను బయటకు తీశారు. అనంతరం ఆమెకు సీపీఆర్ ఇచ్చారు. వెంటనే ఒడ్డుకొని చేరుకుని రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు ఆమెను తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు.

ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాట : రామ్ చరణ్ భార్య ఉపాసన రియాక్షన్ ఏంటంటే..

ఈ ఘటనపై ముని కి రేతి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేష్ సాహ్ తెలిపిన వివరాల ప్రకారం.. రూప ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ మార్కెటింగ్ విభాగంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఆమె తన కుటుంబంతో అంబాలా నగరంలో నివసిస్తున్నారు. శనివారం తన సోదరుడు ఆదిత్య, ముగ్గురు స్నేహితులతో కలిసి రిషికేశ్‌కు వచ్చినట్లు సాహ్ తెలిపారు. 

నిషేధిత గ్రూప్ పీఎఫ్ఐకి చెందిన ఐదుగురి అరెస్టు.. ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌న్న ఎన్ఐఏ

ఇలాంటి ఘటనే శనివారం కాలిఫోర్నియాలోని శాన్ డియాగో తీరంలో చోటు చేసుకుంది. రెండు పడవలు బోల్తా పడటంతో ఎనిమిది మంది మరణించారు. దీనిని అమెరికా తీరాల వెలుపల జరిగిన అత్యంత ప్రమాదకరమైన సముద్ర మానవ స్మగ్లింగ్ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. శనివారం రాత్రి 11:30 గంటలకు శాన్ డియాగో ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులకు ఈ ప్రమాదంపై సమాచారం అందింది. ఓ స్పానిష్ వ్యక్తి ఎమర్జెన్సీ 911కి ఫోన్ చేసి మెక్సికన్ సరిహద్దు సమీపంలోని శాన్ డియాగోలో రెండు పడవలు బోల్తా పడ్డాయని, మొత్తం 23 మంది చిక్కుకుపోయారని తెలిపారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీశారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?