బాలీవుడ్ లో విషాదం.. యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూత

By Asianet News  |  First Published Apr 20, 2023, 12:38 PM IST

బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దివంగత దర్శకుడు యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా మరణించారు. 74 ఏళ్ల ఈ రచయిత, నేపథ్య గాయని, నిర్మాత.. రెండు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె గురువారం చనిపోయారు. 


బాలీవుడ్ దివంగత దర్శకుడు యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (74) కన్నుమూశారు. పమేలా చోప్రా ఒక ప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయని. ఆమె సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. అలాగే రచయితగా కూడా పని చేశారు. పమేలా రెండు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. 

అతిక్ అహ్మద్ సమాధిపై త్రివర్ణ పతాకం పరిచిన కాంగ్రెస్ నేత.. భారతరత్న, అమరవీరుడి హోదా ఇవ్వాలంటూ కామెంట్స్

Latest Videos

ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఆమె చనిపోయారని ‘జీ న్యూస్’ నివేదించింది. అయితే ఆమె మరణంపై యశ్ రాజ్ ఫిల్మ్స్  తన అధికారిక ఇన్ స్ట్రా గ్రామ్ పోస్టులో సంతాపం వ్యక్తం చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

పమేలా చోప్రా చివరిసారిగా వైఆర్ఎఫ్ డాక్యుమెంటరీ ‘ది రొమాంటిక్స్’లో తన భర్త యశ్ చోప్రా, ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. ఆమె 1970 సంవత్సరంలో యశ్ చోప్రాను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు నిర్ణయించిన వివాహం. వీరికి ఆదిత్య, ఉదయ్ చోప్రా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

సల్మాన్ ఖాన్ కు మళ్లీ హత్యా బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్ కు కూడా... ‘దూరంగా ఉండండి’ అంటూ మెయిల్..

కాగా.. పమేలా చోప్రా ప్రభావంతోనే యశ్ చోప్రా మహిళల కోసం అందమైన పాత్రలు రూపొందించారని ఇటీవల ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్య చోప్రా భార్య రాణీ ముఖర్జీ చెప్పారు. ఆయన హీరోయిన్లను తెరపై ప్రెజెంట్ చేసే విధానం చూసి తాను ఎప్పుడూ ఆశ్చర్యపోయేదాన్ని అని ఆమె తెలిపారు. 

click me!