రాహుల్ కు ఎదురుదెబ్బ: పరువు నష్టం కేసు తీర్పుపై స్టే పిటిషన్ డిస్మిస్

Published : Apr 20, 2023, 11:12 AM ISTUpdated : Apr 20, 2023, 12:03 PM IST
రాహుల్ కు ఎదురుదెబ్బ:   పరువు నష్టం  కేసు తీర్పుపై   స్టే  పిటిషన్   డిస్మిస్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో  ఎదురుదెబ్బ తగిలింది.  

సూరత్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ  దాఖలు  చేసిన  పిటిషన్ ను గురువారంనాడు  సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. దొంగల అందరి ఇంటి పేరు మోడీ గా  ఉందని 2019  ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో  జరిగిన  ఎన్నికల సభలో  రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు  చేశారు.  ఈ వ్యాఖ్యల గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే  పూర్ణేష్ మోడీ  పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఈ  ఫిర్యాదు  ఆధారంగా  పోలీసులు కేసు నమోదు  చేశారు. ఈ కేసుపై   ఈ ఏడాది మార్చి  23న  రాహుల్ గాంధీకి  రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ  సూరత్ కోర్టు తీర్పును వెల్లడించింది. 

ఈ తీర్పును  సూరత్ సెషన్స్ కోర్టులో   రాహుల్ గాంధీ   ఈ ఏడాది ఏప్రిల్  3న సవాల్ చేశారు.   సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలని  సూరత్ సెషన్స్ కోర్టును  అభ్యర్ధించారు.  ఈ పిటిషన్ ను  సూరత్ సెషన్స్ కోర్టు  ఇవాళ డిస్మిస్ చేసింది.ఈ ఏడాది మార్చి  23న  సూరత్ కోర్టు  ఇచ్చిన  రెండేళ్ల జైలు శిక్ష  ఆధారంగా  రాహుల్ గాంధీపై  అనర్హత  వేటు పడింది.  సూరత్  సెషన్స్ కోర్టు  తీర్పుపై  హైకోర్టును  రాహుల్ గాంధీ ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. 

పరువు  నష్టం కేసులో  రాహుల్ గాంధీ కి  సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ప్రస్తుతం  రాహుల్ గాంధీ  బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందేఈ ఏడాది మార్చి  23న   సూరత్ కోర్టు  రాహుల్ గాంధీకి  రెండేళ్ల  జైలు శిక్ష విధించిన  మరునాడే   అనర్హత  వేటు  వేయడంపై  బీజేపీయేతర పార్టీలు  తీవ్రంగా తప్పుబట్టాయి. రాజకీయ దురుద్దేశ్యంతో  ఈ నిర్ణయం తీసుకున్నారని  ఆరోపించాయి.    

also read:మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ కు ఈ నెల 13 వరకు బెయిల్ పొడిగింపు

రెండేళ్ల జైలు  శిక్షపై  స్టే  విధించాలని  కోరుతూ  సూరత్ సెషన్స్  కోర్టులో రాహుల్ గాంధీ  పిటిషన్ దాఖలు  చేశారు. కానీ   రాహుల్ గాంధీ  పిటిషన్ ను  సూరత్ సెషన్స్  కోర్టు   ఇవాళ  కొట్టివేసింది.ఇదిలా ఉంటే   అన్ని  రకాల  లీగల్ ఆఫ్షన్స్ ను  వినియోగించుకుంటామని  కాంగ్రెస్ పార్టీ  వర్గాలు  తెలిపాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu