విషాదం.. ప్రియురాలికి వివాహమైందని యువకుడి ఆత్మహత్య.. పెళ్లయిన 3 రోజుల తరువాత నవ వధువు కూడా..

By Asianet News  |  First Published Jul 8, 2023, 10:06 AM IST

తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లయ్యిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు పెళ్లి జరిగిన మూడు రోజులు తరువాత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.


ఓ వివాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు కారణమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి మరొకరిని పెళ్లి చేసుకుందని ఓ యువకుడు తనువు చాలించాడు. ఈ విషయం తెలిసిన ఆ ప్రియురాలి పెళ్లయిన మూడు రోజులకే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో విషాదాన్ని నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

హింస మధ్య పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 73,000 స్థానాలకు మొదలైన పోలింగ్

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. బార్మర్ జిల్లా ధోరిమన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని జైత్మాల్ గ్రామానికి 28 ఏళ్ల పుర్ఖారామ్, 22 ఏళ్ల అనిత ప్రేమికులు. కొంత కాలం నుంచి వీరద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే ఇటీవల అనితకు ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. 4వ తేదీన ఆ యువతి పెళ్లి జరిగింది. దీంతో మనస్థాపం చెందిన పుర్ణారామ్ అదే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ విషయం నవ వధువుకు తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆమె ముభావంగా ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పాలు తీసుకువస్తానని చెప్పి కొట్టానికి వెళ్లింది. చాలా సమయం గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే కొట్టం దగ్గరికి వెళ్లి వెతికారు. చుట్టుపక్కల గాలించగా.. ఓ బావిలో చనిపోయి కనిపించింది. పెళ్లి జరిగిన మూడు రోజులకే వధువు ఇలా తనువు చాలించడం ఆ కుటుంబలో విషాదాన్ని నింపింది. 

అందరి సంతోషం కోసం నిరంతరం తపించారు నాన్న.. మీ స్పూర్తే నన్ను నడిపిస్తోంది - సీఎం వైఎస్ జగన్

ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమేనని ఈ ఇద్దరి ఆత్మహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.  ఈ మొత్తం ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు దోరిమన్న పోలీసు ఏఎస్సై లఖారాం తెలిపారు. కాగా.. ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు వారం రోజుల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

click me!