హింస మధ్య పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 73,000 స్థానాలకు మొదలైన పోలింగ్

Published : Jul 08, 2023, 09:30 AM IST
హింస మధ్య పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 73,000 స్థానాలకు మొదలైన పోలింగ్

సారాంశం

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తంగా 73,000 స్థానాలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడానికి 5.67 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 

పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 73,000 స్థానాలకు పోలింగ్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు మరణించారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) పేర్కొంది.

అందరి సంతోషం కోసం నిరంతరం తపించారు నాన్న.. మీ స్పూర్తే నన్ను నడిపిస్తోంది - సీఎం వైఎస్ జగన్

నేటి ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ లో సుమారు 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రారంభం కావడానికి గంట ముందు టీఎంసీ ఓ ట్వీట్ చేసింది. అందులో తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపించింది. ఇందులో రెజీనగర్, తుఫాన్గంజ్, ఖర్గ్రామ్లలో కు చెందిన కార్యకర్తలు ఉన్నారని పేర్కొంది. అలాగే డోంకోల్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారని పార్టీ తెలిపింది.

హింసాకాండ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలపై టీఎంసీ మండిపడింది. ‘‘ ఎక్కువగా అవసరమైనప్పుడు కేంద్ర బలగాలు ఎక్కడ ఉన్నాయి?’’ అని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా.. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. జులై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu