నేటి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

By telugu teamFirst Published Nov 28, 2019, 11:36 AM IST
Highlights

నేటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 28 ప్రాంతాల్లో 6గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనుండటంతో దాదర్‌లోని శివాజీ పార్క్ గ్రౌండ్‌ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  తదనుగుణంగా ముంబై ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలకు నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. సాయంత్ర 6.40 గంటలకు ప్రమాణస్వీకారం ఉండటంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
 
శివసేన మద్దతుదారులు, కార్యకర్తలతో పాటు ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, మూడు పార్టీలకు చెందిన వీవీఐపీలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇలా కార్యకర్తలు, ముఖ్య అతిధులు వస్తుండడంతో, ట్రాఫిక్ జామ్‌లు తలెత్తకుండా ట్రాఫిక్‌ను ముంబై పోలీసులు క్రమబద్ధీకరించేపనుల్లో నిమగ్నమైపోయారు. 

Also read: అజిత్ "పరార్", ఆపై పీఛే ముడ్: తెర వెనక అసలేం జరిగింది..

దాదాపుగా 30 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాల పార్కింగ్‌ను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూనే ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

స్వతంత్ర వీర్ సావార్కర్ రోడ్డు, కేలుస్కార్ రోడ్డు, దాదర్ ఎంబీ రౌత్ మార్గ్, దాదర్ పాండురంగ్ నాయక్ మార్గ్, దాదర్ దాదాసాహెబ్ రేగే మార్గ్, దాదర్ ఎల్‌టీ, దిలీప్ గుప్తే మార్గ్, ఎన్‌సీ కేల్కర్ మార్గ్, దాదర్ కీర్తి కాలేజ్ లేన్, కృష్ణనాథ్ ధురు రోడ్, పి బాలు మార్గ్, ప్రభాదేవి ఆదర్శ్ నగర్, వోర్లి కోలివాడ ఆర్ఏకే 4 రోడ్డు, ఫైవ్ గార్డెన్స్ సేనాపతి బపట్ మార్గ్, రనడే రోడ్డు, పీఎన్ కొట్నీస్ రోడ్డు, శివాజీ పార్క్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు నేటి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలవరకు అమల్లో ఉంటాయని పోలీసు వర్గాలు తెలిపాయి. 

Also read: మహా రాజకీయం..శివసేన భవన్‌పై బాల్‌థాకరే, ఇందిరాగాంధీల పోస్టర్
 
కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమ వేదికైన శివాజీ పార్క్ ‌ఏరియాలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. పార్క్ గ్రౌండ్స్‌తో పాటు సమీప ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శివాజీ పార్కు తో ఠాక్రే కుటుంబానికి విడదీయరాని బంధముంది.  స్వర్గీయ బాల్ ఠాక్రే ఇక్కడి నుండే తన దసరా రాలీలను నిర్వహించేవాడు. దీనిని శివసేన కార్యకర్తలు ముద్దుగా శివతీర్థ అని పిలుచుకుంటారు. 

click me!