Year ender 2023 : ఈ ఏడాది గూగుల్ లో అత్యధికంగా అడిగిన టాప్ 10 ప్రశ్నలు.. మీరు కూడా ఈ ప్రశ్న అడిగారా?

By Rajesh Karampoori  |  First Published Dec 15, 2023, 4:25 AM IST

Year ender 2023: ఈ ఏడాది చాలా విషయాలనే గూగుల్ లో వెతికే ఉండారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ వేసిన విషయాలు ఏమిటో గూగుల్ వెల్లడించింది. మీరు కూడా ఈ అంశాల్లో కనీసం ఒకటి..రెండింటిని గూగుల్ చేసి ఉండవచ్చు. గత సంవత్సర కాలంలో డేటాను సేకరించిన తర్వాత గూగుల్ ఈ విషయాలను వెల్లడించింది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రశ్నలేంటో మీరు కూడా ఓ లూక్కేయండి ? 


Year ender 2023: చిన్నపిల్లలకు ఏ అనుమానం వచ్చినా వెంటనే తమ తల్లులను అడినట్టు.. మనకు కూడా ఏ చిన్న అనుమానం వచ్చినా.. ఏ ప్రశ్నకైనా సమాధానం  కావాలని భావించినా.. మనకు మొదటగా గుర్తుకు వచ్చేది గూగుల్ లే.. ఏ చిన్న విషయానైనా మనం గూగుల్ ను ఆశ్రయించడం అలవాటుగా మారింది. గూగుల్ లో ఏం సెర్చ్ చేసినా.. ఖచ్చితంగా సమాధానం వస్తుందనే నమ్మకమే దీనికి కారణం.

అంతేకాదు.. ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుందో.. కూడా గూగుల్ కు తెలుసు. అందుకే మనం ఏ ప్రశ్న అడిగినా క్షణాల్లో సమాధానం చెబుతుంది. మనిషి జీవితంలో పుట్టుక నుంచి చావు వరకు ప్రతిదీ గూగుల్ సెర్చింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకప్పుడు మన పూర్వీకులు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేకుండా జీవితాన్ని గడిపారు. కానీ, నేటీ ప్రపంచీకరణ జీవితంలో గూగుల్ లేకుండా లేదా గూగుల్ సెర్చ్ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరంట. అతిశయోక్తి కాదు. అంతగా మన జీవితంలో పెనవేసుకపోయాయి. 
 
మీరు కూడా ఈ సంవత్సరంలో చాలా విషయాలనే గూగుల్ లో వెతికే ఉండారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ వేసిన విషయాలు ఏమిటో గూగుల్ వెల్లడించింది. మీరు కూడా ఈ అంశాల్లో కనీసం ఒకటి..రెండింటిని గూగుల్ చేసి ఉండవచ్చు. గత సంవత్సర కాలంలో డేటాను సేకరించిన తర్వాత గూగుల్ ఈ విషయాలను వెల్లడించింది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రశ్నలేంటో మీరు తెలుసుకోవాంటే వెంటనే చదివేయండి..

Latest Videos

undefined


Googleలో అత్యధికంగా అడిగిన టాప్ 10 ప్రశ్నలు ( Most Asked Questions on Google )

1. నా IP ఏమిటి? (What is my IP) 1,160,000

2. సంవత్సరంలో ఎన్ని వారాలు? (How many weeks in a year)    672,000 

3. ఒక కప్పుకు ఎన్ని ఔన్సులు?(How many ounces in a cup)    617,000

4. Macలో స్క్రీన్‌షాట్ ఎలా చేయాలి?(How to screenshot on Mac)    542,000

5.  సూపర్ బౌల్ ఎప్పుడు వేస్తారు (When is the Super Bowl) 468,000

6. ఈస్టర్ ఎప్పుడు (When is Easter)    466,000

7. ఫాదర్స్ డే ఎప్పుడు (When is Father's Day) 368,000

8. జూన్టీన్త్ అంటే ఏమిటి    (What is Juneteenth) 348,000

9. ఓటర్ ఐడీని ఎలా నమోదు చేసుకోవాలి (How do I register to vote) 345,000

10. థాంక్స్ గివింగ్ ఎప్పుడు (When is Thanksgiving) 331,000

click me!