Today's Top Stories: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. మోడీకి దీదీ ఘాటు లేఖ.. కొడాలి నానికి వైసీపీ షాక్..  

By Rajesh Karampoori  |  First Published Feb 20, 2024, 7:27 AM IST

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో   మోడీకి దీదీ ఘాటు లేఖ..కొడాలి నానికి వైసీపీ షాక్..  రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్‌!, మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. , మేడారం భక్తులకు ఆర్టీసీ అలర్ట్, తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ, ఢిల్లీకి పవన్ కళ్యాణ్: ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన?, కొడాలి నానికి వైసీపీ షాక్..  వంటి వార్తల సమాహారం. 
 


Today's Top Stories: రాహుల్‌కు స్మృతి ఇరానీ సవాల్‌!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) బహిరంగ సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ (Amethi) నుంచి మరోసారి పోటీకి దిగాలని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను ఫ్లాప్ షోగా అభివర్ణించిన ఆమె.. రాహుల్ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనలేదని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీలో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.

Latest Videos

ప్రధాని మోడీకి మమతాబెనర్జీ ఘాటు లేఖ. 

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee)ప్రధాని మోడీ(PM Modi)పై సీరియస్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీకి చెందిన వారి ఆధార్ కార్డులను  డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ప్రధానిని నిలదీశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు. ఆధార్ కార్డులను నిర్ల్యక్షపూరితంగా డీయాక్టివేషన్ చేయడాన్ని దీదీ తీవ్రంగా తప్పుపట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ లేఖ రాసి ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడానికి గల కారణాన్ని తెలియజేయాలన్నారు. ఈ చర్య బెంగాల్ ప్రజలలో "ఆందోళన" సృష్టించిందని అన్నారు. ఆధార్ కార్డును "డీయాక్టివేట్" చేసే ఈ కసరత్తు నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయానికి విఘాతం కలిగిస్తోందని అన్నారు.

మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. 

మూసీ నది పునరుద్ధరణ, సుందరీకరణ పనులను ప్రారంభించే ముందు మూసీ నది ప్రక్షాళన చేపట్టాలని, రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులను మూడు నెలల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నానక్‌రామ్‌గూడలో హెచ్‌ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
 

సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అందుకేనా.. ?
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఫిబ్రవరి 19న) సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.

మేడారం భక్తులకు ఆర్టీసీ అలర్ట్


Medaram Jatara: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం కీలక ప్రకటన చేశారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీలో వెళ్లే భక్తులకు ఆయన ఓ సూచన చేశారు. బస్సుల్లోకి మూగ జీవాలను తీసుకురావద్దని కోరారు. బస్సులోకి కోళ్లు, గొర్రెలు, మేకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వాటిని బస్సులోకి తీసుకురావొద్దని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.


తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ

TSPSC Group-1: తెలంగాణలో  గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన  గంటల వ్యవధిలోనే  కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు  టీఎస్‌పీఎస్‌సీ  నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల  23 నుండి మార్చి 14వ తేదీ వరకు  ఆన్ లైన్ లో ధరఖాస్తును స్వీకరించనున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ మాసంలో  ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్  లేదా అక్టోబర్ లలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.  


ఢిల్లీకి పవన్ కళ్యాణ్: ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఈ నెల  22న ఢిల్లీ వెళ్లనున్నారు.  బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.ఢిల్లీ పర్యటన తర్వాత  అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని  ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి.  ఈ కూటమిలో బీజేపీ కూడ చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఇటీవల న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో  చర్చించారు. 

కొడాలి నానికి వైసీపీ షాక్..  

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కొడాలి నానిపై నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి సెగ వెలుగు చూసింది. దీంతో, ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి దక్కే అవకాశం  కనిపించడం లేదని చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ విడుదల చేసిన జాబితాలో గుడివాడ సీటు గురించిన క్లారిటీ లేదు. మరోవైపు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు అనే కాపు అభ్యర్థి ఎన్నిక కాబోతున్నట్లుగా సూచనలు వెలువడుతున్నాయి.
 

click me!