Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee)ప్రధాని మోడీ(PM Modi)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీకి చెందిన వారి ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ప్రధాని మోడీకి ఘాటు లేఖ రాశారు. ఆధార్ కార్డులను నిర్ల్యక్షపూరితంగా డీయాక్టివేషన్ చేయడాన్ని దీదీ తీవ్రంగా తప్పుపట్టారు.
Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee)ప్రధాని మోడీ(PM Modi)పై సీరియస్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీకి చెందిన వారి ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ప్రధానిని నిలదీశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు. ఆధార్ కార్డులను నిర్ల్యక్షపూరితంగా డీయాక్టివేషన్ చేయడాన్ని దీదీ తీవ్రంగా తప్పుపట్టారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ లేఖ రాసి ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేయడానికి గల కారణాన్ని తెలియజేయాలన్నారు. ఈ చర్య బెంగాల్ ప్రజలలో "ఆందోళన" సృష్టించిందని అన్నారు. ఆధార్ కార్డును "డీయాక్టివేట్" చేసే ఈ కసరత్తు నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయానికి విఘాతం కలిగిస్తోందని అన్నారు.
సిఎం మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో “పశ్చిమ బెంగాల్‌లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబిసి వర్గాల ప్రజల ఆధార్ కార్డులను విచక్షణారహితంగా డీయాక్టివేట్ సంఘటనను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏ కారణం చెప్పకుండా ఆధార్ కార్డును అకస్మాత్తుగా డీయాక్టివేట్ చేయడానికి కారణాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను బెంగాల్ ప్రజలకు అందకుండా చేయడమా? లేక లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమా?’’ అని నిలదీశారు.
undefined
రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు
న్యూఢిల్లీలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎటువంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండానే లేదా రాష్ట్రాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా నేరుగా సంబంధిత వ్యక్తులు, కుటుంబ సభ్యులకు నిష్క్రియ లేఖలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర వాసులలో భయాందోళనలు, అలజడిని సృష్టించాయి, ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 50మంది ఆధార్‌కార్డులు పనిచేయడం లేదని మమతా ఆరోపించారు. మమతా బెనర్జీ రాసిన లేఖపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మమతా ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందిస్తారో? లేదో? వేచి చూడాలి.