Today Top Stories: ముగిసిన ప్రజా పాలన.. షర్మిలకే నా మద్దతు.. సీఎం రేవంత్ కి అగ్నిపరీక్ష.. అంగన్‌వాడీలపై ఎస్మా

By Rajesh Karampoori  |  First Published Jan 7, 2024, 6:35 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో 'షర్మిలకే నా సపోర్టు' , రేవంత్‌ రెడ్డికి సవాల్ .. నూతన బాధ్యతలు అప్పగించిన అధిష్టానం, ఫార్మూలా ఈ -రేస్ రద్దు.. కేటీఆర్ ఫైర్, ముగిసిన ప్రజా పాలన..  ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై .. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్, ఇస్రో చరిత్రలో మరో మైలురాయి: తుదికక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ -1 వంటి పలు వార్తల సమాహారం.
 


Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో 'షర్మిలకే నా సపోర్టు' , రేవంత్‌ రెడ్డికి సవాల్ .. నూతన బాధ్యతలు అప్పగించిన అధిష్టానం, ఫార్మూలా ఈ -రేస్ రద్దు.. కేటీఆర్ ఫైర్, ముగిసిన ప్రజా పాలన..  ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై .. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్, ఇస్రో చరిత్రలో మరో మైలురాయి: తుదికక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ -1 వంటి పలు వార్తల సమాహారం.

షర్మిలకే నా మద్దతు

Latest Videos

CM Revanth Reddy |కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డికే తన సపోర్టు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్ధి అని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని  రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కావాలని వైఎస్ జగన్ భావిస్తే.. ఏపీలో కాంగ్రెస్ గెలవాలని తాను కోరుకున్నానని, అలాగే.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆయన కోరుకుంటే.. తాను రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాబట్టి రాజకీయంగా తామిద్దరం ప్రత్యార్థులమేనని అన్నారు.

 తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డి  

Revanth Reddy: Revanth Reddy: సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది.  ఫిబ్రవరి లేదా మార్చి నాటికిఎన్నకల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నిక సమరాన్ని ఎదుర్కొవడానికి అన్ని పార్టీలు  సమాయాత్తమౌతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాస్తా దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేస్తూ..భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీలను ఏర్పాటు చేసింది.

తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. తెలంగాణ, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర.. ఈ జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు మొత్తం 25 మందికి ఆ ఎన్నికల కమిటీలో స్థానం కల్పించింది.  ఏర్పాటైన కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీ జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా వంటి పలువురు నేతలకు ఆ జాబితాలో చోటు దక్కింది.


ముగిసిన ప్రజా పాలన..  ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. 

Praja Palana: ప్రజా పాలన శనివారానికి ముగిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీన ముగిసింది. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,08,94,115 దరఖాస్తులు అందాయి. చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు అందినట్టు అధికారుల నుంచి సమాచారం వస్తున్నది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమంలో సుమారు ఒక కోటి 30 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం అధికంగా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది. వీటితోపాటు రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు.

ఫార్మూలా ఈ -రేస్ రద్దు.. కేటీఆర్ ఫైర్


హైదరాబాద్ లో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను చూడాలనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఇ-ప్రిక్స్ ఫార్ములా- ఇ’ రేసింగ్‌ రద్దైంది. ఈ విషయాన్ని 'ఫార్ములా -ఇ' నిర్వహకులు వెల్లడించారు. తెలంగాణ లో ఏర్పాడిన కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో  రద్దు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అదే విధంగా రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీష్‌లు జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్స్ వింగ్‌ పేర్కొం‍ది. ఫార్ములా 2  ఇ రేస్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించినందుకు తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శనివారం తీవ్రంగా విమర్శించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా 2  రేసు రద్దు గురించి, ఫార్ములా ఇ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు.

టీఎస్పీఎస్సీ కేసులో కీలక పరిణామం..  


TSPSC PAPER LEAK CASE: తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. లీకేజి కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు హాజరుకాని నిందుతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు హాజరుకాని ఏడుగురు నిందితులకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. శుక్రవారం రోజున నిందితులందరినీ విచారణ కొరకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా శనివారం  జరిగిన విచారణకు నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 హాజరు కాలేదు. విచారణకు రావడం లేదని నిందితులు గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే నిందితుల అనుమతి నిరాకరిస్తూ.. ఆ ఏడుగురిపై నాంపల్లి హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. 

వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై !
 
ఇటీవలే వైసీపీలో చేరిన టీమీండియా మాజీ కెప్టెన్ అంబటి రాయుడు పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ట్వీట్ చేశారు. పదిరోజుల క్రితమే అంబటి రాయుడు పార్టీలో చేరారు. అంతలోనే పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగాఉంటానన్నా రాయుడు, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. అంబటిరాయుడు డిసెంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.  

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సజ్జల రియాక్షన్

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికను,ఆమె పార్టీ విలీనంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అందర్నీ మేనేజ్ చేస్తూ అధికారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వల్ల వైసీపీకి ఏ నష్టం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, వారి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని, గత రెండు ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాలేదని, ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గుర్తించడం లేదని ఏద్దేవా చేశారు. 

అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం: జీవో జారీ చేసిన ఏపీ సర్కార్

అంగన్ వాడీల సమ్మెపై  ఎస్మాను ప్రయోగిస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ  జీవో నెంబర్ 2ను  ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు,  నిరసనలు నిషేధమని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అంగన్ వాడీలపై ఎస్మాను ప్రయోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. ఈ మేరకు  ఇవాళ జీవో  2ను జారీ చేసింది.  తమ వేతనాలను పెంచాలని కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు  ఆందోళన చేస్తున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు  వేతనంలో  కోత పడింది.సమ్మె చేసిన కాలానికి  వేతనంలో  కోత వేసింది జగన్ ప్రభుత్వం.అంగన్ వాడీ వర్కర్లకు  గత నెల వేతనం రూ. 8050 జమ చేసింది ప్రభుత్వం.వేతనంలో సుమారు రూ. 3 వేలు కోత విధించింది ప్రభుత్వం.

తుది కక్ష్యలోకి చేరిన ఆదిత్య ఎల్ -1  

ఆదిత్య ఎల్ -1  తుది కక్ష్యలోకి చేరింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  ఆదిత్య ఎల్-1 ను  ఇస్రో శాస్త్రవేత్తలు  నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆదిత్య  ఎల్  1  వ్యోమ నౌక  శనివారంనాడు  తుది కక్ష్యలోకి  ప్రవేశించింది.ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో  శ్రీహరికోట నుండి శాస్త్రవేత్తలు  వ్యోమనౌకను తుది కక్ష్యలోకి  ప్రవేశ పెట్టారు. 2023 సెప్టెంబర్ 2 వ తేదీన  ఆదిత్య ఎల్ -1 ను  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు.  ఈ127 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1  ఇవాళ  సాయంత్రం నాలుగు గంటలకు తుది కక్ష్యలోకి చేరింది.ఐదేళ్ల పాటు  ఆదిత్య ఎల్ -1  సేవలను అందించనుంది.  సూర్యుడికి సమీపంలోని  లాంగ్రాజ్ పాయింట్ హాలో  కక్ష్యలోకి  ఇవాళ సాయంత్రం ఆదిత్య ఎల్ -1 శాటిలైట్ ను  ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.

click me!