జాతీయ హోదా కోల్పోయిన మూడు పార్టీలు: ఏపీలో రాష్ట్ర హోదా చేజార్చుకున్న బీఆర్ఎస్

Published : Apr 10, 2023, 07:57 PM ISTUpdated : Apr 10, 2023, 08:47 PM IST
  జాతీయ హోదా  కోల్పోయిన  మూడు  పార్టీలు: ఏపీలో రాష్ట్ర హోదా  చేజార్చుకున్న  బీఆర్ఎస్

సారాంశం

మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి.  సీపీఐ,  టీఎంసీ,  ఎన్సీపీలు  జాతీయ  హోదాను కోల్పోయాయి. 

న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ,  టీఎంసీలకు  కేంద్ర  ఎన్నికల సంఘం షాకిచ్చింది.  ఈ మూడు  పార్టీలకు  జాతీయ  పార్టీ  హోదాను కేంద్ర ఎన్నికల సంఘం  తొలగించింది .జాతీయ  పార్టీ హోదా  విషయమై  ఉన్న  నిబంధనలను  అనుసరించి  కేంద్ర ఎన్నికల సంఘం  నిర్ణయం తీసుకుంది. 
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  ఆర్ఎల్‌డీ , ఏపీలో  బీఆర్ఎస్ , మణిపూర్ లో  పీడీఏ,  పుదుచ్చేరిలో  పీఎంకే , పశ్చిమ బెంగాల్ లో  ఆర్‌ఎస్‌పీ , మిజోరంలలో   ఎంపీసీలకు రాష్ట్ర  పార్టీ హోదా  రద్దు చేసింది  ఈసీ.

 తెలంగాణలో  బీఆర్ఎస్ ను  రాష్ట్ర పార్టీ హోదాను  కల్పించింది  ఎన్నికల సంఘం. నాగాలాండ్ లో  లోక్ జనశక్తి  పార్టీ, మేఘాలయలో  వాయిస్ ఆఫ్ పీపుల్ , త్రిపురలో  టిప్రామోతా పార్టీలకు  రాష్ట్ర రాజకీయ  పార్టీ  హోదాను  ఈసీ  కల్పించింది.  ఆమ్ ఆద్మీ పార్టీకి  జాతీయ  హోదా  దక్కింది.   జాతీయ హోదా విషయంలో  నిబంధనల మేరకు  ఆప్   ఓట్లు, సీట్లు దక్కించుకున్నందున   జాతీయ  హోదా  కల్పించినట్టుగా  ఎన్నికల సంఘం  ప్రకటించింది.  ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్,  సీపీఎం , బీఎస్పీ, ఎన్‌పీపీ,ఆప్  లు మాత్రమే  జాతీయ హోదా కలిగి  ఉన్నాయి. 

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  టీఆర్ఎస్  కు  రాష్ట్ర పార్టీ హోదా ఉంది. గత  ఏడాది  అక్టోబర్ మాసంలో  టీఆర్ఎస్  పేరును   బీఆర్ఎస్ గా మార్చారు.  బీఆర్ఎస్  పేరుతో  ఏపీలో ఆ పార్టీ  ఓట్లు, సీట్లు  దక్కించుకోలేదు.  దీంతో  ఏపీలో  బీఆర్ఎస్  కు  రాష్ట్ర పార్టీ హోదాను  తొలగించారు.  దేశవ్యాప్తంగా  పార్టీని విస్తరించాలని  కేసీఆర్  నిర్ణయం తీసుకున్నారు.  కానీ  ఈ సమయంలో  బీఆర్ఎస్  ఏపీలో రాష్ట్ర  హోదాను  కోల్పోవడం  ఆ పార్టీ శ్రేణులను నిరాశ  కల్గిస్తుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?