Times now exit polls:మహారాష్ట్రలో అధికారం వైపు కమలం అడుగులు

Published : Oct 21, 2019, 06:46 PM ISTUpdated : Oct 21, 2019, 06:58 PM IST
Times now exit polls:మహారాష్ట్రలో అధికారం వైపు కమలం అడుగులు

సారాంశం

మహారాష్ట్రలో బీజేపీ శివసేనలు అధికారం దిశగా దూసుకు వెళ్లనున్నాయని టైమ్స్ నౌ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చిచెప్పింది.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 288 స్థానాలకు సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో  బీజేపీ శివసేన కూటమి విజయం సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారంగా బీజేపీ శివసేన కూటమి విజయం సాధించనుందని సర్వే తేల్చింది

బీజేపీ, శివసేన 230
కాంగ్రెస్ 48
ఇతరులు  10

Read more #Exit polls రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ సర్వే : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే హవా...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

Read more #exitpolls: మహారాష్ట్రలో బీజేపీ హవా, వార్ వన్ సైడ్ ... ఏబీపీ సి ఓటర్ సర్వే...

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది. 
 

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit