లాక్ డౌన్ ఎత్తివేత.. సరి, బేసి విధానం అమలు?

Published : May 04, 2020, 01:32 PM IST
లాక్ డౌన్ ఎత్తివేత.. సరి, బేసి విధానం అమలు?

సారాంశం

ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదన్న ఆయన దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.   

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ కరోనా కేసులను అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. ఇప్పటికి నాలుగుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. అయితే.. ఈ లాక్ డౌన్ ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లాక్ డౌన్ ని కొన్ని రాష్ట్రాలు మద్దతు ఇస్తుంటే.. రాష్ట్ర ఆదాయానికి గండి పడుతోందని కొన్ని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. కాగా.. లాక్ డౌన్ ఎత్తివేయాలని కోరుకుంటున్న రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఉండటం గమనార్హం.

ఢిల్లీలో లాక్ డౌన్ ఎత్తివేతకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదన్న ఆయన దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు. 

ఇక ఢిల్లీని తెరిచే సమయం ఆసన్నమైందన్న ఆయన కరోనా వైరస్ తో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధపడాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా మూసివేస్తామని, ఇతర ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించి సరి బేసి రోజుల్లో షాపులను తెరిపించేందుకు ఏర్పాట్లు చేపట్టామని ఆయన లాక్ డౌన్ ఎత్తివేత వ్యూహాలను వివరించారు.

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్