దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణకు కళ్లెం పడడం లేదు. భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మహారాష్ట్రలో మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు.
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,55 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,533కు పెరిగింది. గత 24 గంటల్లో మరో 73 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 1,373కు చేరుకుంది.
ఇప్పటి వరకు 11,707 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 29,453 ఉంది. రికవరీ రేటు 27.52 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది.
ముంబైలో కరోనా మంట చల్లారడం లేదు. ఆదివారంనాడు ముంబైలో కొత్తగా 441 కేసులు నమోదు కాగా, 21 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,613కు చేరుకుంది. మరణాల సంఖ్య 343కు చేరింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12,296కు చేరుకుంది. మొత్తం రాష్ట్రంలో 521 మంది మరణించారు.
ప్రపంచ వ్యాప్తంగా 35 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.