జమ్మూకాశ్మీర్ కానిస్టేబుల్ హత్య పై ప్రతీకారం తీర్చుకున్న భద్రతాదళాలు

First Published Jul 22, 2018, 11:16 AM IST
Highlights

జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నుండి అక్కడ భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి.  భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ  ఎన్కౌంటర్ ద్వారా భద్రతాదళాలు జమ్మూకాశ్మీర్ కానిస్టేబుల్ మృతికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో ఓ కానిస్టేబుల్‌ను కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురిచేసి అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అతడి ఇంట్లోకి చొరబడీ మరీ కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు చంపిన తర్వాత కైమో ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు. దీంతో  పోలీసులు, భద్రతాదళాలు ఉగ్రవాదుల జాడ కోసం కుల్గాం జిల్లాను జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదుల జాడను భద్రతాదళాలు కనిపెట్టాయి. అత్యంత పకడ్బందీగా వారిపై కాల్పులకు దిగారు. అయితే ఉగ్రవాదులు కూడా అప్రమత్తమై ఎదురు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. అతడి కోసం జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపడుతున్నట్లు రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్‌ తెలిపారు. సంఘటనా స్థలంనుండి భద్రతా దళాలు మూడు ఆయుదాలను స్వాధీనం చేసుకున్నారు.
 
click me!