రాజస్థాన్‌లో 7 నెలల పసిగుడ్డుపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

First Published Jul 22, 2018, 10:08 AM IST
Highlights

ఏడు నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి రాజస్థాన్‌లోని స్పెషల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది

ఏడు నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి రాజస్థాన్‌లోని స్పెషల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మే 9న పింటూ అనే యువకుడు తన పొరిగింట్లోని పాపను అపహరించికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. పాప కనిపించక తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఊరంతా వెతగ్గా.. ఇంటికి కిలోమీటరు దూరంలోని మైదానంలో పాప ఏడుస్తూ రక్తస్రావంతో కనిపించింది.

ఆపస్మారక స్థితిలో ప్రాణాపాయంలో ఉన్న ఆమెను రక్షించడానికి వైద్యులు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పింటూను అదుపులోకి తీసుకుని.. నేరం రుజువు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను సంపాదించారు.

దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుడు అత్యంత ఘోరమైన తప్పు చేశాడని.. అతనికి సభ్య సమాజంలో తిరిగే హక్కు కానీ.. భూమిపై జీవించే హక్కుకానీ లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల చట్టాలను మరింత కఠినతరం చేస్తూ మార్చిలో రాజస్థాన్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఆ తరువాత అత్యాచారం కేసులో మరణదండన తీర్పు వచ్చిన తొలి కేసు ఇదే.
 

click me!