విద్యార్థినిని బెదిరించి.. సామూహిక అత్యాచారం

Published : Mar 19, 2021, 09:41 AM IST
విద్యార్థినిని బెదిరించి.. సామూహిక అత్యాచారం

సారాంశం

ఆమె తల్లిదండ్రులు చెన్నైలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న ఈ బాలికతో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.  

విద్యార్థినిని బెదిరించి సామూహిక లైంగిక దాడి జరిపిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా తిరునావలూరుకు చెందిన పదమూడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు చెన్నైలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న ఈ బాలికతో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పరిచయం పెంచుకున్నాడు.


ఈ క్రమంలో విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడి స్నేహితులు సైతం ఆమెపై అత్యాచారం జరిపారు. అంతేగాక అసభ్య వీడియోలు బయటపెడతామంటూ బెదిరించి పలుమార్లు అకృత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉళుందూరుపేట మహిళా పోలీసులు ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో వున్న మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word