21 నుంచి ఢిల్లీలో కేఏ పాల్ ఆమరణ దీక్ష !

By AN TeluguFirst Published Mar 19, 2021, 9:20 AM IST
Highlights

సాగు చట్టాలకు, విశాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ ఈనెల 21 నుంచి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను గురువారం ఆయన ఢిల్లీలో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. 

రైతులతో మాట్లాడిన తరువాత భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ తో కలిసి ఢిల్లీల్లోని ఏపీ భవన్లో పాల్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తక్షణమే సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, రైతులను అమ్మకానికి పెట్టిందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ రైతు నేత తికాయత్ తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామని అన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తికాయత్ హెచ్చరించారు. 

click me!