పీటీ ఉషా రికార్డు బద్దలు కొట్టిన యువతి..!

Published : Mar 19, 2021, 08:51 AM IST
పీటీ ఉషా రికార్డు బద్దలు కొట్టిన యువతి..!

సారాంశం

జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

పరుగుల రాణి పీటీ ఉషా గురించి తెలియని వారు ఉండరు. వేగంగా పరుగులు తీయడంలో ఆమెకు ఆమే సాటి.  కాగా.. అలాంటి ఆమె రికార్డును ఓ యువతి తిరగరాసింది.

ఫెడరేషన్‌ కప్‌ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్‌ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్‌ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్‌ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

దాంతో 1998లో ఇదే మీట్‌లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్‌ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్‌ హీట్‌లోనూ మరో స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది.

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇక అంతే సంగ‌తులు.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న
మోదీ ప‌ర్య‌ట‌న‌వేళ తీవ్ర క‌ల‌క‌లం.. న‌కిలీ ఐడీ, తుపాకీతో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తులు