బాణసంచా వాడకంపై యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఎన్సీఆర్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో నిషేధం..

By team telugu  |  First Published Oct 30, 2021, 11:00 AM IST

దీపావళి పండగ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న జాతీయ రాజధాని ప్రాంతం(NCR)తో పాటుగా ఇతర ప్రాంతాల్లో టపాసుల (firecrackers) అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రకటించింది. 


దీపావళి పండగ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న జాతీయ రాజధాని ప్రాంతం(NCR)తో పాటుగా ఇతర ప్రాంతాల్లో టపాసుల (firecrackers) అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గాలి నాణ్యత సరిపడే అంతా లేక మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే గ్రీన్ టపాసుల వినియోగాన్ని అనుమతించనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీసు ఉన్నతాధికారులకు టపాసుల విక్రయం, వినియోగానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసినట్టుగా ఉత్తరప్రదేశ్ హోం శాఖ అదరనపు కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్తీ తెలిపారు. 

‘ఎయిర్ క్వాలిటీ మోడరేట్ లేదా అంతకంటే తక్కువగా ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ రెండు గంటలకు మించి కాల్చకండి. క్రిస్మస్, న్యూ ఇయర్, సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ రాత్రి 11.55 గంటల నుంచి 12.30 మధ్య మాత్రమే కాల్చాలి.. ఎయిర్ క్వాలిటీ మోడరేట్ లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నిబంధన పాటించాలి’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

Latest Videos

undefined

Also raed: Huzurabad bypoll: ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల దంపతులు.. ఈరోజు కూడా డబ్బు పంచుతున్నారు.. ఈటల కామెంట్స్

నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత 'మోడరేట్' కేటగిరీలో ఉండటం గమనార్హం. ఇక, హాపూర్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, సోన్‌భద్ర, వారణాసి, ఫిరోజాబాద్, ఝాన్సీ, ఖుర్జా, ప్రయాగ్‌రాజ్, మీరట్, మొరాదాబాద్, బరేలీ, రాయ్ బరేలీ, మధుర, సహరాన్‌పూర్, గోరఖ్‌పూర్, ఉన్నావ్, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, బులంద్‌షహర్, అలీఘర్ ఇతర నగరాల‌లో కూడా ఎయిర్ క్వాలిటీ మోడరేట్‌గా‌నే ఉంది. 

Also read: ఆసుపత్రిలోనే డాక్టర్ బాబు రాసలీలలు.. సిబ్బందితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్.. చివరకు..

దీపావళి వేడుకల్లో బాణసంచా వాడకానికి సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇతరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వేడుకలు జరుపుకోలేమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. బాణసంచాపై పూర్తి నిషేధం లేదని, అయితే బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్‌పై మాత్రమే నిషేధం ఉంటుందని స్పష్టత ఉచ్చింది. తాము ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా.. వేడుకల్లో నిషేధించిన బాణసంచాను అనుమతించే అధికారం ఎవ్వరికీ లేదని కూడా జస్టిస్ ఎం.ఆర్.షా, సట్సి ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. వేడుకల పేరుతో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం కుదరదని, ఈ విషయమై భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ వారికి రక్షణ కల్పిస్తోందని చెప్పింది.

బాణసంచా తయారీ, వినియోగం, నిషేధిత బాణసంచా అమ్మకాలకు సంబంధించి కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా ప్రచారం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

click me!