దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే స్కూల్స్‌కు కొన్నిరోజుల పాటు సెలవులను కూడా ప్రకటించింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పాఠశాలలకు ముందుగానే శీతకాల విరామం ఇవ్వాలని నిర్ణయించింది. వాయు కాలుష్యం కారణంగా నవంబర్ 9 నుంచి 18 వరకు ఢిల్లీ పాఠశాలల్లో శీతాకాల విరామం ప్రకటించింది. అన్ని పాఠశాలలను వెంటనే మూసివేయాలని ఆదేశించింది.
ఆరు రోజులుగా నగరాన్ని కప్పేసిన విషపూరిత పొగమంచు దృష్ట్యా - నగరంలోని పాఠశాలలు నవంబర్ 9 నుండి 18 వరకు శీతాకాల విరామం కోసం మూసివేయబడతాయని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం తెలిపింది. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరుకాగా.. ఆ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే వాస్తవానికి ఢిల్లీలో విద్యార్థులకు డిసెంబర్, జనవరి మధ్య సాధారణంగా శీతాకాల విరామం ప్రకటిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా 10, 12 తరగతులు మినహా అన్ని తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. పాఠశాలల మూసివేత కారణంగా విద్యార్థుల చదువులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ఇప్పుడు ప్రకటించిన సెలవులను శీతాకాల విరామంతో సర్దుబాటు చేస్తున్నారు.
ఇదిలాఉంటే, ఢిల్లీ ప్రభుత్వం నగరంలో విషపూరిత గాలిని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రయత్నాలు పెద్దగా విజయం సాధించలేదు. ఈ ఉదయం ఏక్యూఐ.. ఢిల్లీలో 418, నోయిడాలో 409, గురుగ్రామ్‌లో 370గా ఉంది.