రోడ్డు పక్కనే ఉన్న దర్గాను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published : Aug 07, 2022, 04:16 PM IST
 రోడ్డు పక్కనే ఉన్న దర్గాను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సారాంశం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ సమీపంలోని జిగలూరు గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న దర్గాను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ సమీపంలోని జిగలూరు గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న దర్గాను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక, మృతులను హనుమంతప్ప బేవినకట్టి, రేణుక బేవినకట్టి, రవీంద్రలుగా గుర్తించారు. 

మృతులు హుబ్లీకి చెందినవారిగా తెలుస్తోంది. వీరు కుటుంబ సమేతంగా బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  జిగలూరు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న దర్గా గోడను వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుందగోల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !