
P Chidambaram: పార్లమెంట్ నిష్క్రియమైందనే నిర్ధారణకు వచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కీలక ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను నియంత్రిస్తుందనీ, వాటిని నిర్వీర్యం చేస్తుందని, అవసరమైతే..వాటిని స్వాధీనం చేసుకుంటున్నారని చిదంబరం ఆరోపించారు.
దేశంలో ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నదని సంచలన వ్యాఖ్యలు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సెషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి సమన్లు అందకుండా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను రక్షించడంలో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు విఫలమయ్యారని ఆయన అన్నారు.
షా ప్రకటనపై చిదంబరం మండిపాటు
పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు చేస్తే.. రామ మందిరానికి శంకుస్థాపన చేసిన రోజుతో ముడిపెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తోసిపుచ్చారు. రామ మందిరానికి, ప్రదర్శనలకు సంబంధం లేదనీ, ప్రదర్శన తేదీని ముందుగానే ఖరారు చేశారన్నారు. శనివారం ఉపరాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరగనున్నందున, ఎంపీలందరూ ఢిల్లీలో ఉంటారని దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు చిదంబరం తెలిపారు. లాజిక్‌ను వక్రీకరించినందుకు ఎవరైనా ఎవరినైనా నిందించవచ్చునని అన్నారు. అలాగే, 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌ను అక్రమంగా విభజించారని చెప్పుకోచ్చారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పెంపు సమస్యలపై కాంగ్రెస్ నల్ల బట్టల ప్రదర్శనను పార్టీ బుజ్జగింపు విధానంగా అభివర్ణించిన షా, తాను ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశానని చెప్పడం గమనార్హం. ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించేందుకే కాంగ్రెస్ ఈ ప్రదర్శన నిర్వహించిందని షా పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్య, ద్రవ్యోల్బణం వ్యతిరేకంగానే నిరసనలు చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని అమిత్ షా ఆరోపణలు చేశారని,హోం మంత్రి తమ శాంతియుత నిరసనను పరువు తీయడానికి అసహ్యకరమైన ప్రయత్నం చేసాడనీ, ముర్ఖ మనస్తత్వం ఉన్నవారు మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు.