సోదరుడితో గొడవ... ఒంటిపైని బట్టలు చించేసి...యువతిపై అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Mar 21, 2021, 09:43 AM ISTUpdated : Mar 21, 2021, 09:49 AM IST
సోదరుడితో గొడవ... ఒంటిపైని బట్టలు చించేసి...యువతిపై అత్యాచారయత్నం

సారాంశం

సోదరుడి ముందే ఓ యువతి(25)ని బలత్కరించడానికి ప్రయత్నించారు ముగ్గురు యువకులు. 

న్యూడిల్లీ: ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా ఓ లారీ డ్రైవర్ పై కూడా దాడిచేసి డబ్బులు దోచుకున్నారు ముగ్గురు యువకులు. శనివారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు ఒక్కరే. ఈ ఘటనలు దక్షిణ డిల్లీలో  చోటుచేసుకున్నారు.  
 
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత గురువారం అర్ధరాత్రి సమయంలో యోగేశ్(26), నవీన్(25), బల్జీత్(30) ఓ యువకుడితో గొడవ పడ్డారు. అయితే సదరు యువకుడి సోదరి ఈ ముగ్గురుని అడ్డుకుని సోదరున్ని కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో వీరు దారుణానికి ఒడిగట్టారు. సోదరుడి ముందే యువతి(25)ని బలత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె ఒంటిపై వున్న బట్టలను చించేసి అత్యాచారానికి ప్రయత్నించారు. 

యువకుల భారీనుండి ఎలాగోలా యువతి తప్పించుకుంది. దీంతో అక్కడి నుండి వెళ్లిపోయిన ఈ ముగ్గురు యువకులు ఓ లారీ డ్రైవర్ ను చితకబాది రూ.30వేలు దోచుకున్నారు.  యువతితో పాటు  లారీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యాచారయత్నం, ఛోరీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు  చేశారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం