18 మందిని పెళ్లాడి, నగలూ నగదుతో పరారీ: ఆమె తెలుగు యువతి?

Published : Mar 21, 2021, 09:28 AM ISTUpdated : Mar 21, 2021, 09:29 AM IST
18 మందిని పెళ్లాడి, నగలూ నగదుతో పరారీ: ఆమె తెలుగు యువతి?

సారాంశం

18 యువకులను మోసం చేసి, వారి నుంచి నగలూ నగదుతో పారిపోయిన యువతిని రాజస్థాన్ లోని జునాగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువతి తెలుగు రాష్ట్రాలకు చెందింది కావచ్చునని భావిస్తున్నారు.

జునాగఢ్: ఓ యువతి అనూహ్యమైన పరిస్థితిలో పోలీసులకు చిక్కింది. ఆమె 18 మంది యువకులను పెళ్లాడి నగలూ నగదుతో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను బాగ్ పతి అలియాస్ అంజలిగా గుర్తించారు. ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. 

ఆమెతో పాటు మరో ఐదుగురిని రాజస్థాన్ లోని జునాగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆ ముఠా పలువురిని మోసగించినట్లు పోలీసులు అంటున్నారు. జునాగఢ్ కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదు పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు 

నకిలీ పత్రాలతో, మారుపేరుతో ఆమె గుజరాత్ లో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. యువకులను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగలూ నగదుతో పారిపోవడం అనే మోసం నాటకాలను ఆ ముఠా సాగిస్తున్నట్లు తేలింది. జునాగఢ్ పరిధిలోని అంబాలియా గ్రామానికి చెందిన యువకుడిని పెళ్లాడి, ఎప్పటి మాదిరిగానే నగలతో పాటు రూ.3 లక్షల మేర నగదుతో ఆమె పారిపోయిది. 

ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతంలో ఉన్నట్లు విచారణలో తెలియడంత చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు వారిని అరెస్టు చేశారు అంజలి, ఆమె తల్లి ధనుబెన్ లను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి చేతుల్లో 18 యువకులు మోసపోయినట్లు తేలింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం