కోడిగుడ్ల కూర వండ‌లేద‌ని క‌న్నత‌ల్లిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడు

Published : Oct 10, 2022, 01:34 PM IST
కోడిగుడ్ల కూర వండ‌లేద‌ని క‌న్నత‌ల్లిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడు

సారాంశం

ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకున్నది. కోడిగుడ్డు కూర  వండ‌లేద‌ని  ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో కుమారుడిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే.. అస‌లు మ‌నుషుల్లో మాన‌వ‌త్వం మిగిలే ఉందా?  అనే ప్ర‌శ్న త‌లెత్తుంది. కొన్ని క‌థ‌నాల‌ను వింటే..  సిగ్గుతో తలదించుకోవాల్సి దుస్థితి వస్తోంది. ఆధునిక ప్ర‌పంచం సాంకేతిక అభివృద్ధితో దూసుకుపోతున్నప్పటికీ .. కొన్ని దారుణ‌, అమానుష్య‌ ఘటనలు వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడూ  మ‌నిషి ఇంకా అనాగరిక ప్ర‌పంచంలోనే  ఉండిపోయాడా అన్న సందేహం రాక‌మాన‌దు. కుటుంబ బంధాలకు, త‌ల్లిదండ్రుల‌ విలువ నిచ్చే మ‌న‌ దేశంలో కొంతమంది దుర్మార్గుల చేసే దారుణాల వ‌ల్ల‌ తలవంచుకునే దుస్థితి ఏర్పడుతోంది. తాజాగా నవమాసాలు మోసి కని పెంచి క‌న్న త‌ల్లిని కోడిగుడ్డు కర్రీ  వండ‌లేద‌న ఓ చిన్న కార‌ణంతో అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ విషాద ఘ‌ట‌న‌ ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకున్నది. ఈ ఘటన దసరా పండుగ మరుసటి రోజు జరిగింది. క‌న్న తల్లిని హత్య చేసిన క‌సాయిని  తార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా తార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గజపదర్ గ్రామానికి చెందిన త్రిబేణి (50) తన కొడుకు సనాతన్. త‌న కొడుకు పూర్తిగా మ‌ద్యానికి బానిస‌. నిత్యం తాగి  ఇంటికి వ‌చ్చి త‌న కుటుంబ స‌భ్యుల‌ను వేధించే వాడు. ఈ కారణంగా కొన్నేండ్ల క్రితం త్రిబేణి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. ఇక సనాతన్ భార్య కూడా అతన్ని విడిచిపెట్టి  త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా త్రిబేణి తన కొడుకును ఓ సారి చూడాల‌ని.. దసరా పండక్కి గంజాం జిల్లాలో ఉంటున్న కొడుకు వద్దకు వచ్చింది. 

అయితే.. ఫూల్ గా తాగి వ‌చ్చిన కుమారుడు సనాతన్‌.. కోడిగుడ్డు కూర చేయమని తల్లికి ఆర్డ‌ర్ వేశాడు. త‌న‌కు ఆరోగ్యం బాగ‌లేద‌ని.. వంట చేయ‌డానికి నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోయిన కుమారుడు తల్లి తలను గోడకేసి బాదాడు. ఆ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా.. అనంతరం ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  

ఇంట్లో గొడవలు, అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు కూడా గుమిగూడారు. వెంట‌నే పోలీసుకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే తరసాంగ్ పోలీస్ స్టేషన్ బృందం ఘ‌ట‌న స్థలానికి చేరుకుంది.  త్రిబేణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు  ఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. హంత‌కుడు సనాతన్‌ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ త‌ర‌లించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌