
ఢిల్లీలో ఘోరం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారు నివాసం ఉండే ప్లాట్ లో శవమై కనిపించారు. నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్యగా స్థానికులు భావిస్తున్నారు.
భారత విదేశాంగ విధానం భేష్.. అమెరికాకు కూడా తలొగ్గడం లేదు - పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 8.55 గంటలకు, వసంత్ విహార్ ప్రాంతంలోని వసంత్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నంబర్ 207 లోపలి నుండి తాళం వేసి ఉంది. చాలా సమయం పాటు ఇంట్లో నుంచి కదలికలు, స్పందన లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఆ ప్లాట్ వద్దకు చేరుకున్నారు. తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. ఆ పరిసరాలను గమనించగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పాక్షికంగా తెరిచి ఉండటంతో పాటు సూసైడ్ నోట్ కూడా లభించింది. లోపలి గదిలో వెతకగా మూడు మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆ గదిలోనే మూడు చిన్న అంగితి (బొగ్గుల కుంపటి లాంటి పరికరం)లను గదిలో ఉంచారు. అందులో మంట పెట్టి ఉంచినట్టు గుర్తించారు.
పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..
ఆ అంగితీల వల్ల ఏర్పడిన పొగ పీల్చి ముగ్గురు మృతి చెంది ఉంటారని నైరుతి ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ సి తెలిపారు. మృతులను మంజు, ఆమె కుమార్తెలు అన్షిక, అంకుగా గుర్తించారు. అయితే మంజు భర్త గత ఏడాది ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారిన పడి మరణించాడు, అప్పటి నుంచి ఈ కుటుంబం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మంజు కూడా అనారోగ్యంతో మంచంపైనే ఉంది.