పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

Published : May 22, 2022, 10:37 AM IST
పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని Jogia Kotwali ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 28పై ఆగివున్న లారీని ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోని Jogia Kotwali ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 28పై ఆగివున్న లారీని ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్‌యూవీ వాహనంలో 11 మంది ఉన్నారు. వారంతా వివాహా వేడుకకు హాజరై తిరగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గోరఖ్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్ట‌మ్ నిమిత్తం తరలించారు. ఇక, ఎస్‌యూవీ వాహనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.   

ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. 

 

 

ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు  ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్టు పీఎంవో ప్రకటించింది. గాయపడిన ఒక్కొక్కరికి రూ. 50,000 అందజేస్తామని పీఎంవో తెలిపింది.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?