కర్ణాటక కాంగ్రెస్ నేత హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Oct 24, 2023, 12:16 PM IST

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు ఎం శ్రీనివాస్‌పై ఆరుగురు వ్యక్తులు కొడవళ్లతో దాడి చేసి సోమవారం నరికి చంపారు.


కర్ణాటక : కర్ణాటకలోని కోలార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు ఎం శ్రీనివాస్‌ హత్యకేసులో ప్రమేయమున్న ఆరుగురిలో ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రాథమిక నిందితులు వేణుగోపాల్ మరియు మనీంద్ర కాలికి తుపాకీ గాయాలు తగిలాయి, పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో సంతోష్ కూడా గాయపడ్డాడు.

అనుమానితులను ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు దాడి చేయడంతో ప్రతీకారంగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, పోలీసు సిబ్బంది మంజునాథ్, నగేష్‌లకు కూడా గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Latest Videos

undefined

పండగపూట విషాదం.. దుర్గా పూజ మండపం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి మృతి..

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు ఎం శ్రీనివాస్ సోమవారం ఆరుగురు వ్యక్తులు జరిపిన దాడిలో మరణించారు. శ్రీనివాస్ మాజీ స్పీకర్ రమేష్ కుమార్, హోం మంత్రి జి పరమేశ్వరతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీనివాస్ నిర్మాణంలో ఉన్న బార్ నిర్మాణాన్ని పర్యవేక్షించి.. అక్కడినుంచి తన ఫామ్‌హౌస్‌కు వచ్చాడు.

"దుండగులు శ్రీనివాస్ కి తెలిసినవారే.. అందుకే.. కాఫీ ఆఫర్ చేశాడు. శ్రీనివాస్ తో ఉన్న భద్రతా అధికారి దానిని ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అతని చుట్టూ 3-4 కుర్చీలు ఉన్నాయి. మరియు కొంతమంది దుండగులు వాటిపై కూర్చున్నారు. వారిలో ఒకరు అతనిలో కొంత రసాయనాన్ని కళ్ళపై స్ప్రే చేసాడు. అతను కేకలు వేయడం ప్రారంభించాడు. 

దీంతో వారిలో మరొకరు అతని మీద దాడికి దిగి.. అతనిని కత్తితో పొడిచడం ప్రారంభించాడు, తప్పించుకోవడానికి గోడ వైపు పరిగెత్తాడు. అతని అంగరక్షకుడు దీనిని చూశాడు, కానీ అతను కూడా భయాందోళనతో పారిపోయాడు"అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు జాలప్పను ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు ఆయన తెలిపారు.

click me!