అవమానకర ఘటన.. ఛత్రపతి శివాజీ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్టు..

Published : Aug 15, 2023, 07:16 PM IST
అవమానకర ఘటన.. ఛత్రపతి శివాజీ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్టు..

సారాంశం

గోవాలో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలపై గోవా పోలీసులు మంగళవారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు .

గోవాలో ఓ అవమానకర ఘటన చోటు చేసుకుంది. గోవాలోని మపుసా పట్టణంలోని కరస్వాడోలో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపవిత్రం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర గోవా జిల్లాలోని కరస్వాడ గ్రామంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సోమవారం అపవిత్రం చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డివైఎస్‌పి) జివ్‌బా దాల్వి మాట్లాడుతూ..నైజెస్ల్ జోక్విమ్ ఫోన్సెకా, అలెక్స్ ఫెర్నాండెజ్,లారెన్స్ మెండిస్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

ఆ నిందితులందరూ మపుసా నివాసితులని తెలిపారు. శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అపవిత్రం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాత్రి వందలాది మంది మపుసా పోలీస్ స్టేషన్ వెలుపల గుమిగూడారు. ముగ్గురు నిందితులను కోర్టు ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపినట్లు డీఎస్పీ దాల్వీ తెలిపారు. విగ్రహానికి సమీపంలో ఉన్న నిందితుల దుకాణాలను సోమవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 295-ఎ (మతపరమైన భావాలను ఉల్లంఘించడం), 153-ఎ (గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 427-ఎ (దుష్ప్రవర్తనకు పాల్పడి నష్టం కలిగించడం) కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని దాల్వీ తెలిపారు.

శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి 

నార్త్ గోవా ఎంపీ, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి.. ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది మన సంస్కృతిపై దాడి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కార్లోస్ ఫెరీరా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రంలోగా విగ్రహాన్ని మారుస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..