"ఇదే చివరిసారి.." :ప్రధాని మోడీపై లాలు ఫైర్

By Rajesh Karampoori  |  First Published Aug 15, 2023, 6:30 PM IST

ప్రధాని మోడీపై ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గుప్పించారు. ప్రధాని మోడీ బూటకపు మాటలను నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరని, ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేయడం ఇదే చివరిసారని అన్నారు.  


దేశవ్యాప్తంగా నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. వారి ఆశయాన్ని నెరవేర్చడానికి మనం నిబద్ధతతో ఉండాలని పునరుద్ఘాటించారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్ష రాజ్య మంత్రి అజయ్ భట్, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే స్వాగతం పలికారు.

ఇదిలావుండగా.. ప్రధాని మోడీపై ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గుప్పించారు. దేశ ప్రజలు ప్రధాని మోడీ బూటకపు మాటలను నమ్మే పరిస్థితిలో లేరని, ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేయడం ఇదే చివరిసారని ఏద్దేవా చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సర్క్యులర్ రోడ్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారనీ, వారి సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని, స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పిస్తున్నాము. 

click me!