Shopian Encounter: ఆర్మీ వాహనం బోల్తా… ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

Published : Apr 15, 2022, 04:54 AM ISTUpdated : Apr 15, 2022, 06:24 AM IST
Shopian Encounter:  ఆర్మీ వాహనం బోల్తా… ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

సారాంశం

Shopian Encounter: జ‌మ్ముకశ్మీర్ లోని షోపియాన్‌లో ఆర్మీ వాహనం బోల్లాప‌డింది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో  ముగ్గురు సైనికులు మరణించగా, ఐదుగురు సైనికులు  గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న  షోపియాన్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది.   

Shopian Encounter: జ‌మ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయ‌లో పడి ముగ్గురు సైనికులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. 

వివ‌రాల్లోకెళ్తే..షోపియాన్‌లోని బడిగామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్ కౌంట‌ర్   కొన‌సాగుతోంది. ఈ క్రమంలో భార‌త ఆర్మీకి స‌హాయంగా అదనపు బలగాలను అక్కడకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్తున్న ఆర్మీ వాహనం కనిపోరా గ్రామం సమీపంలో బోల్తా పడిందని రక్షణ శాఖకు చెందిన శ్రీనగర్‌ పీఆర్వో తెలిపారు.  ప‌లు నివేదికల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. ఐదుగురు గాయపడినట్లు వర్గాలు తెలిపాయి. తడిగా ఉన్న రహదారి కారణంగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయిన‌ట్టు తెలిపాయి. గాయపడిన సైనికులను షోపియాన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు,

వారిలో ఇద్దరు మరణించినట్లు ప్రకటించారు. ఒక సైనికుడికి స్వల్ప గాయాలు కాగా జిల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ క్ర‌మంలో మెరుగైన వైద్యం కోసం సైనికులను శ్రీనగర్‌లోని 92 బేస్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్ర‌మంలో మ‌రో సైనికుడు కూడా గాయాలతో మరణించాడు. మిగిలిన నలుగురు సైనికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఉగ్ర‌వాదుల రాళ్లదాడి వల్ల ప్రమాదం జ‌రిగింద‌ని సోషల్ మీడియాలో  పుకార్లులు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో అవాస్తవమని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. పుకార్లు మానుకుని శాంతిభద్రతలను స‌మాకూర్చాల‌ని సూచించారు.   షోపియాన్‌ జిల్లాలో జ‌రుగుతున్న ఎన్ కౌంట‌ర్ లో నలుగురు లష్కరే ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన‌ట్టు స‌మాచారం. వారిని లష్కరే తాయిబాకు చెందిన అకీబ్‌ ఫరూఖ్‌ థోకర్‌, వసీమ్‌ అహ్మద్‌ థోకర్‌, ఫరూఖ్‌ అహ్మద్‌ భట్‌, షోకీన్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించామని అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం