Petrol Re 1 Per Litre: బంప‌ర్ ఆఫ‌ర్..! రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎక్క‌డంటే...?

Published : Apr 15, 2022, 02:11 AM IST
 Petrol Re 1 Per Litre: బంప‌ర్ ఆఫ‌ర్..! రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎక్క‌డంటే...?

సారాంశం

Petrol Re 1 Per Litre: అంబేడ్కర్​ జయంతి సందర్భంగా మహారాష్ట్ర లోని సోలాపుర్​లో ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం.. సంచ‌ల‌న ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మొద‌టి 500 మందికి ఒక్కొక్కరికి లీటర్ చొప్పున పెట్రోల్​ ఇచ్చింది. దీంతో భారీ సంఖ్యలో వాహనదారులు ఎగ‌బడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఈ ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది బంక్ యాజమాన్యం.  

Petrol Re 1 Per Litre: దేశంలో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్ప‌టికే పెట్రోల్ సెంచరీ మార్క్  దాటేసింది. దీంతో వాహనదారులు చుక్కలు చూపిస్తున్నాయి. గ‌త వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలు పెరిగాయి.   లీటర్ పెట్రోల్  పై సగటను 4 రూపాయాల వ‌ర‌కు పెరిగింది. దీంతో వాహనదారులు ప్ర‌త్యామ్న‌య మార్గాల మీద ఫోకస్ చేశారు. ఈ క్ర‌మంలో పెట్రోల్ ఓ బంప‌ర్ ఆఫర్ ప్రకటిస్తే ఎలా ఉంటుంది. అది కూడా.. కూడా ఒక్క రూపాయో.. రెండు రూపాయాలో తగ్గించ‌డం కాదు. ఏకంగా.. లీటర్ పెట్రోల్ రూపాయికే పోస్తామని చెబితే ఎలా ఉంటుంది. ఈ ఆఫ‌ర్ న‌మ్మశ‌క్యంగా లేదు కాదా..?  మీరు న‌మ్మినా? న‌మ్మ‌క‌పోయిన ఇది నిజ‌మండీ బాబూ..! ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ లో జ‌రిగింది. 

వివ‌రాల్లోకెళ్తే.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద‌ర్భంగా..  మహారాష్ట్రలోని షోలాపూర్ లో ఓ పెట్రోల్ బంక్ యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. ఎవ్వ‌రూ న‌మ్మని విధంగా.. రూపాయికే లీటర్ పెట్రోల్ అంటూ సంచ‌ల‌న ప్రకటన చేశాడు. అయితే.. ఈ ఆఫ‌ర్ మొద‌టి 500 మందికి  మాత్ర‌మే ఒక్కొక్కరికి లీటర్ చొప్పున పెట్రోల్​ పోస్తామ‌ని ప్ర‌క‌టించడంతో అక్కడ క్యూ లైన్ పెరిగింది. వాహనదారులు ఆ పెట్రోల్ బంకు వద్దకు భారీగా తరలివచ్చారు. దాంతో వారందరినీ కట్టడి చేసేందుకు పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

ఈ ఆఫ‌ర్ మొద‌టి 500 ల మందికి మాత్ర‌మే అందించ‌డంతో మిగిలినవాళ్లు నిరుత్సాహంతో వెనుదిరిగారు. దేశంలో పెట్రో ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అందరికీ తెలుసు. ప్ర‌సుత్తం లీట‌ర్ పెట్రోల్ రూ.120 వరకు న‌మోదవుతున్న విష‌యం తెలిసిందే. ఇందుకు నిర‌స‌న‌గా..  సామాన్యులకు పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేసినట్లు బంక్ యాజమాన్యం తెలిపింది.
 
అంతర్జాతీయ మార్కెట్.. బ్యారెల్ ధర.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం తదితర కారణాల వ‌ల్ల పెట్రోలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌మంల చాలా సీరియ‌స్ గా ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వరసగా పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అంతకుముందు స్థిరంగా ఉన్నాయని విమ‌ర్శిస్తున్నాయి ప్ర‌తిప‌క్షాలు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం