Bjp Mp Suresh Gopi: " సాగు చట్టాల‌ను తిరిగి తీసుక‌వ‌స్తాం".. బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Rajesh K  |  First Published Apr 15, 2022, 3:30 AM IST

Bjp Mp Suresh Gopi: వివాద‌స్ప‌ద వ్యవసాయ చట్టాలు మళ్లీ వస్తాయనీ,  నిజమైన రైతులు ఆ  చ‌ట్టాల‌ను తిరిగి తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నందున వాటిని తీసుక‌వ‌చ్చామ‌ని బీజేపీ ఎంపీ సురేష్ గోపి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగాన్ని మోస‌గించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  
 


Bjp Mp Suresh Gopi: గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన  సాగు చ‌ట్టాల‌పై బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్‌గోపీ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు.  కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌పై దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర వ్య‌తిరేకించింది. సాగు చ‌ట్టాల బిల్లుల్ని వెన‌క్కి తీసుకోవాలనే డిమాండ్‌పై ఢిల్లీ కేంద్రంగా రైతులు చేప‌ట్టిన ఉద్య‌మానికి ఎట్ట‌కేల‌కు  రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో వివాదాస్పద సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసింది.  అయితే.. సాగు చ‌ట్టాల‌ను తిరిగి తీసుకొస్తుందని పేర్కొన్నారు సురేశ్‌గోపీ.  

గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను కేంద్రం తిరిగి తీసుకొస్తుందని పేర్కొన్నారు. ‘నేను బీజేపీ మనిషిని. సాగు చట్టాలను రద్దుచేయటంపై తాను చాలా కోపంగా ఉన్నాన‌నీ.. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ చట్టాలను మళ్లీ తీసుకొస్తామ‌ని, నిజమైన రైతులు ఆ చట్టాలు కావాలని కోరుతార‌ని పేర్కొన్నారు.

Latest Videos

ఏంపీ సురేష్ గోపి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విషు వేడుకలను ప్రారంభిస్తూ.. ఇలా మాట్లాడారు. “నేను బిజెపి వ్యక్తిని… వ్యవసాయ చట్టాల ఉపసంహరణపై చాలా కోపంగా ఉన్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యవసాయ చట్టాలు మళ్లీ వస్తాయని నేను చెబుతాను. నిజమైన రైతులు వాటిని డిమాండ్ చేస్తారు. వారు తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. లేకుంటే రైతులే ఈ ప్రభుత్వాన్ని వెన‌క్కి పంపిస్తార‌ని అన్నారు.

click me!