
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ ఇటీవల ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. అయితే ఈ నేపథ్యంలో ఇదే రాష్ట్రం బాన్సువారలోని ఓ లాయర్ కు బెదిరింపు లేఖ వచ్చింది. అందులో ఉదయపూర్ ఘటన ప్రస్తావిస్తూ హెచ్చరికలు ఉన్నాయి. సునీల్ ఆచార్య అనే లాయర్ కు ఈ బెదిరింపు లేఖ రావడంతో ఆయన అప్రమత్తమయ్యారు. బాన్సువాడ బార్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్న ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ లేఖకు ఖచ్చితమై కారణాన్ని వెల్లడించనప్పటికీ.. అంతర్గత వివాదం ద్వారా ఇది చోటు చేసుకుందని భావిస్తున్నారని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ.. ప్రధాని మోడీపై మరో మనీహిస్ట్ పోస్టర్‌తో విమర్శలు
ఉదయ్ పూర్ కు చెందిన టైరల్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అతడి షాప్ లోకి ప్రవేశించి దారుణంగా తలనరికారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బయటకు విడుదల చేశారు. ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తాము ఈ పని చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్ని వర్గాల నుంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపించింది.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ప్రత్యేక పూజలు..
ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రాజ్‌సమంద్ జిల్లా భీమ్ పట్టణంలో వీరిని పట్టుకున్నారు. ఈ కేసును ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించారు. ‘‘ ఈ నిందితులకు దావత్-ఎ-ఇస్లామీ సంస్థతో సంబంధాలు ఉన్నాయని జూన్ 29 న డీజేపీ మీడియా సమావేశం తెలియజేశారు ’’ అని ATS, SOG యొక్క ప్రకటన పునరుద్ఘాటించింది.
Amravati Murder : ఫార్మసిస్టు హత్యను దోపీడి కేసుగా తప్పుదోవ పట్టించారు - ఎంపీ నవనీత్ రాణా
ఈ దాడి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగడంతో పాటు కర్ఫ్యూ విధించారు. జిల్లా యంత్రాంగం ఆదివారం 10 గంటల పాటు కర్ఫ్యూను విధించింది. దీంతో ఉదయపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అలాగే నగరంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలించామని, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సడలింపు ఉంటుందని ఉదయ్‌పూర్ కలెక్టర్ తారా చంద్ మీనా శనివారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం కర్ఫ్యూ సడలింపు నిర్ణయం తీసుకున్నారు.