నమాజ్ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 30 మంది అరెస్టు

By telugu teamFirst Published Oct 29, 2021, 3:05 PM IST
Highlights

హర్యానాలో నమాజ్ ప్రార్థనలపై రచ్చ జరుగుతున్నది. గుర్గావ్‌లో కొద్ది వారాలుగా నమాజ్ ప్రార్థనలను ఆటంకపరుస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. బహిరంగ ప్రాంతాల్లో లేదా ఆ ప్రాంతంలో నమాజ్‌ను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాలు నమాజ్ చేయడానికి గుర్తించినవేనని, అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి సహకరించాలని అధికారులు స్థానికులకు సూచించారు. తాజాగా, సెక్టార్ 12ఏలో నమాజ్‌ను ఆటంకపరుస్తూ ఆందోళనలకు దిగడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: Haryanaకు చెందిన గుర్గావ్‌లో Namaz ప్రార్థనలకు సంబంధించి కొన్ని వారాలుగా రగడ జరుగుతున్నది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ ప్రార్థనలను వ్యతిరేకిస్తూ కొందరు Protest చేస్తున్నారు. గత రెండు శుక్రవారాలతోపాటు నేడు కూడా గుర్గావ్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. తాజాగా, ముందు జాగ్రత్తగా పోలీసులు 30 మంది ఆందోళనకారులను Arrest చేశారు.

Gurgaon పాలకులారా నిద్ర నుంచి మేలుకోండి అంటూ ప్లకార్డులు పట్టుకుని రైట్ వింగ్ కార్యకర్తలు పెద్దపెట్టున సెక్టార్ 12ఏ ఏరియాలో ఆందోళనలకు దిగారు. చాలా మంది గుమిగూడటంతో Policeలు వెంటనే రంగంలోకి దిగారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తతలేమీ లేవని, నమాజ్ Prayesను ఆటంకం కలిగిస్తున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నామని గుర్గావ్ ఎస్‌డీఎం అనితా చౌదరి వివరించారు. గత కొన్ని వారాలుగా ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయని, కానీ, నేడు వేగంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Also Read: అసెంబ్లీలో ప్రత్యేకంగా నమాజ్ రూమ్.. ‘హరే రామా’ నినాదాలతో బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనలు

ఇలాంటి ఘటనలే 2018లో చోటుచేసుకన్నాయి. అప్పుడే హిందు, ముస్లింలు చర్చించుకున్నారు. ఆ తర్వాత 37 ప్రాంతాలు నమాజ్ చేసుకోవచ్చనే అంగీకారానికి వచ్చారు. అందులోనే సెక్టార్ 12ఏ, సెక్టార్ 47లు ఉన్నాయి. కానీ, గత కొన్ని వారాలుగా ఈ రెండు ప్రాంతాల్లో నమాజ్ చేసుకునే సమయంలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. నమాజ్‌ను ఆటంకపరుస్తూ ఇక్కడ ఆ ప్రార్థనలు చేయడానికి వీల్లేదని, వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

గుర్తించిన 37 ప్రాంతాల్లో నమాజ్ చేసుకోవడానికి ముస్లింలకు భద్రతనిస్తామని, అక్కడ నమాజ్ చేసుకోవడానికి అనుమతులున్నాయని ఎస్‌డీఎం అనితా చౌదరి వెల్లడించారు. తాజాగా, సెక్టార్ 12ఏ ప్రాంతంలో ఆందోళనలు జరగడంతో పోలీసులు వచ్చారు. బారికేడ్లు పెట్టారు. కొందరిని అక్కడి నుంచి తీసుకెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలోకి వచ్చాయి.

ఇటీవలి వారాల్లోనే సెక్టార్ 47 ఏరియాలో బహిరంగ ప్రాంతంలో నమాజ్ చేసుకోవడాన్ని కొందరు అభ్యంతరపెట్టారు. ఇన్‌డోర్‌లో ప్రార్థనలు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు ఈ ప్రాంతాల్లో నమాజ్ ముసుగుతో కొందరు రొహింగ్యా శరణార్థులు వస్తున్నారని, వారితో నేరాలు పెరిగే ముప్పు ఉందని అధికారుల ముందు తమ ఆందోళనలు ఉంచారు. ఈ ఆందోళనలతో నిరసనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు వారికి గుర్తించిన ప్రాంతాల్లో నమాజ్ చేయడంలో తప్పు లేదని, అందుకు సహకరించాలని స్థానికులను కోరారు.

Also Read: హిందువుల ముందు నమాజ్, భలే కిక్ ఇచ్చింది... వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు... క్రికెట్‌కి మతం మకిలి...

గతవారం ఆందోళనలు జరగ్గానే కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ స్పందించారు. గుర్తించిన ప్రాంతాల్లో నమాజ్ చేస్తే అందుకు స్థానికులు సహకరించాలని సూచించారు. ఇదే నెలలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ఈ ఆందోళనలపై స్పందించారు. ప్రతి ఒక్కరికీ ప్రార్థనలు చేసుకునే హక్కు ఉన్నదని, కానీ, ఆ ప్రార్థనలు చేసేవారు దారులను బ్లాక్ చేయవద్దని అన్నారు. ఎవరు ఎవరి మనోభావానలను దెబ్బతీయవద్దని, ఎవరి ప్రార్థనలను మరొకరు అంతరాయపరచవద్దని సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన ప్రాంతాల్లోనే వారు నమాజ్ చేసుకుంటే వారి ప్రార్థనలను ఆటంకపరచవద్దని అన్నారు. ఈ ఆందోళనలను సఖ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులు ఈ సమస్యపై సరిగ్గానే వ్యవహరిస్తున్నారని తెలిపారు.

click me!